దీపా కర్మాకర్ కోసం రోడ్లు..
posted on Oct 18, 2016 @ 12:01PM
రియో ఒలింపిక్స్ లో జిమ్మాస్టిక్స్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన దీపా కర్మాకర్ కు క్రికెట్ లెజెండ్ చేతులు మీదగా బీఎండబ్యూ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈకారును ఆమె వెనక్కి ఇచ్చేద్దామని అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈవార్తలకు స్పందించిన దీపా.. ఎట్టి పరిస్థితిలో సచిన్ ఇచ్చిన కారు వెనక్కి ఇచ్చేది లేదని.. అయితే అగర్తలలో రోడ్లు సరిగా లేవని... వీటిపై ఇంత ఖరీదైన కారును నడపటం సాధ్యం కాదంటూ చెప్పింది. దీంతో ఇది తమ రాష్ట్రానికి మచ్చ తెచ్చే పని అని భావించిన అక్కడి ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. దీపా కర్మాకర్ ఇంటి దగ్గర, సమీపంలోని కొన్ని రోడ్లును బాగుచేస్తున్నామని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజినీర్ సోమేష్ చంద్రదాస్ వెల్లడించారు. మరికొంతమంది మంత్రులు, సీపీఎం నేతలు మాత్రం దీపా కర్మాకర్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగర్తలలోని రోడ్ల గురించి మాట్లాడి రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారని వాళ్లు విమర్శించారు. త్రిపురలో ఎన్నో ఖరీదైన కార్లు తిరుగుతున్నాయని, దీపా కుటుంబం మాత్రం కారును వెనక్కి ఇచ్చేయాలన్న నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదని రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి బాదల్ చౌదరి అన్నారు.