ట్రంప్ గోడ కడితే కట్టుకో.. నష్టం లేదు..
posted on Jul 11, 2016 @ 11:27AM
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ట్రంప్ దిట్ట అని మనకు తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన మెక్సికో పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కనుక అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతానని వ్యాఖ్యానించారు. అంతేకాదు మెక్సికన్లు వలసదారులని, రేపిస్టులని, డ్రగ్ డీలర్లని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మెక్సికో సైలెంట్ గా ఉంటుందా.. ఘాటుగానే సమాధానమిచ్చింది. ఆ దేశ ప్రెసిడెంట్ పెనా నీటో ట్రంప్ వ్యాఖ్యలకు స్పందించి.. ట్రంప్ మనస్తత్వం హిట్లర్, ముస్సోలినీ వంటి నియంతల మనస్తత్వం కలదని అన్నారు. రెండు దేశాల సరిహద్దుల్లో గోడ కట్టాలని భావిస్తే నిరభ్యంతరంగా కట్టుకోవచ్చని.. దాని వల్ల తమకు వచ్చే నష్టం ఏంలేదని.. అది అమెరికా ప్రభుత్వం అంతర్గత విషయమని తేల్చి చెప్పారు. మొత్తానికి ట్రంప్ తన నోటి దురుసుతో పక్క దేశాలతో కూడా వైరం పెంచుకునేలా ఉన్నారు.