మన ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు.. మరోసారి ట్రంప్
posted on Apr 23, 2016 @ 5:55PM
అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్ప వ్యాఖ్యలు చేయడం కామన్. అసలు దానివల్లే ఆయన ఎక్కువ ఫేమన్ అయ్యారని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. భారత్ సహా మిగిలిన దేశాలు అమెరికాలోని ఉద్యోగాలు తన్నుకుపోతున్నారని గతంలో ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఉద్యోగాల పట్ల తన వ్యతిరేకతను ప్రదర్శించారు. అమెరికాలోని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ తమ దేశంలోని ఉద్యోగాలను ఇతర దేశస్తులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు దీనికి సంబంధించి ఒక తన అనుభవాన్ని కూడా చెప్పుకొచ్చారు. గతంలో ఒక రోజు తాను క్రికెట్ కార్డు సమాచారం కోసం కష్టమర్ కేర్ కు కాల్ చేస్తే.. ఓ లేడీ తన కాల్ లిఫ్ట్ చేసిందని.. ఇంతకీ ఆమె ఎక్కడి నుంచి మాట్లాతుందనే విషయం తెలుసుకోవాలని ఆమెను ఆడిగితే ..ఇండియా నుంచి అని సమధానం చెప్పిందని ట్రంప్ వెల్లడించారు. పెద్ద పెద్ద ఉద్యోగాల నుంచి చిరు ఉద్యోగాల వరకు ఈ స్థాయిలో మన ఉద్యోగాలు వేరే దేశాలు ముఖ్యంగా ఇండియా, చైనా, వియాత్నం, మెక్సికో్ దేశాలు విపరీతంగా దోచుకుంటున్నాయన్నారు.
అయితే తిట్టి ఆ తరువాత బుజ్జిగించే మాదిరి.. తాను ఆ దేశాలకు వ్యతిరేకం కాదు.. ఆ పరిస్థితులు కల్పించిన గత పాలకులను నింధిస్తున్నా అని చెప్పుకొచ్చారు. కాగా న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.