అమ్మవవుతావని ఆశలు పెట్టారు...వెలుగులోకి డాక్టర్ల మోసం
posted on Sep 22, 2022 @ 9:03PM
మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సిని మా గుర్తండే ఉంటుంది. అందు లో చనిపోయిన వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటూ లక్షలు గుంజు తారు ఓ ఆస్పత్రివారు. అసలు సంగతి తెలుసుకుని చిరు వారి నుంచే డబ్బులు ఇప్పిస్తాడు. దాదాపు ఇదే సీన్ కాకినాడలో జరిగింది. తూర్పు గోదావరిజిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన సత్యనారా యణతో వివా హం అయ్యింది. ఈ ఏడాది జనవరిలో సత్యనారా యణ తన భార్యను వైద్య పరీ క్షల కోసం కాకినాడ గాంధీనగర్‌లోని రమ్య ఆసుపత్రికి తీసు కెళ్లారు. గర్భందాల్చిందని చెప్పి వైద్యులు తొమ్మిది నెలలు తిప్పించుకుని.. ట్రీట్‌మెంట్ చేశారు. పరీక్షల కోసం తరచూ అదే ఆస్పత్రికి వెళుతున్నారు. డాక్టర్లు వెళ్లిన సమయంలో స్కానింగ్, మందులు రాసిచ్చేవారు. అంతటితో ఆగకుండా ఆరో నెలలో స్కా నింగ్ తీసి.. సెప్టెంబర్ 22న ప్రసవం అవుతుందని డాక్టర్లు చెప్పారు.
ఆ తర్వాత మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లగా..కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంతలో అక్కడి డాక్టర్లు స్కానింగ్ తీసి అసలు మహాలక్ష్మి గర్భవతి కాదని తేల్చి చెప్పారు. దీంతో మహాలక్ష్మితో పాటు కుటుంబ సభ్యు లకు నోట మాటరాలేదు.. ఆశ్చర్యంతో, మోసపోయామన్న ఆందోళనతో ఉండిపోయారు.
ఆందోళనకు గురైన మహాలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ రమ్య ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ స్కానింగ్ తీయాలని కోరారు. ఆమెను ఆస్పత్రి సిబ్బంది స్కానింగ్‌కు పంపారు. స్కానింగ్ తీసే వ్యక్తి మహాలక్ష్మి గర్భంలో శిశువు లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఇదేంటని డాక్టర్‌ను ప్రశ్నించగా.. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పారు. తొమ్మిది నెలల నుంచి తమను ఆస్పత్రికి తిప్పి వేల రూపాయలు ఖర్చు పెట్టించారని మహాలక్ష్మి తల్లి ఆరోపించారు. గర్భంలో బిడ్డ ఆరో గ్యంగా ఉందని చెప్పి ప్రతి నెలా మందులు రాసిచ్చారని.. వాటిని వాడాక తమ కుమార్తె పొట్ట పెద్దదైందని వాపోయారు. కాసుల కోసం అమ్మతనంతో ఆటలు ఆడిన రమ్య ఆస్పత్రి డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని వారు ఆందోళనకు దిగారు.
కాకినాడ రమ్య ఆసుపత్రి వివాదం మరింత ముదిరింది. లేని గర్భాన్ని ఉన్నట్లు నమ్మించి దొంగ రిపోర్టులు ఇచ్చి తమను మోసం చేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఆమెకు గర్భం రాలేదని తాము కూడా చెప్పామంటున్నారు రమ్య ఆసుపత్రి డాక్టర్లు. ప్రతీ గర్భవతికి మూడో నెల, ఆరో నెల, తొమ్మిదో నెలలో స్కానింగ్ తీయిస్తామన్నారు. స్కానింగ్ చేయిం చుకోవాలని తాము ఎన్నిసార్లు చెప్పినా.. వాళ్లు చేయించుకోలేదని తెలిపారు. ఆగస్టు 25న 8వ నెలలో స్కానింగ్ చేయించి నప్పుడు బిడ్డ లేదని స్పష్టం చేశామన్నారు. కానీ, ఆ రిపోర్టును వారు చూపడం లేదని అంటున్నారు.
మహాలక్ష్మినే..ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఊహించుకుందని.. ప్రతీసారి బేబీ కదులుతోందని చెప్పిందన్నారు రమ్య ఆసుపత్రి డాక్టర్లు. అసలు, తాము డెలివరీ డేటే ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎవరిని నమ్మాలి. ఆస్పత్రులు, డాక్టర్ల మోసాలకు అంతులేకుండా పోతోంది.