నర్సు పై.. డాక్టర్..
posted on May 5, 2021 @ 3:45PM
అది తెలంగాణ. జగిత్యాల జిల్లా. అది ఓ ప్రైవేటు అసుపత్రి. ఆ డాక్టర్ పేరు రాజేష్. మూడు నెలల క్రితం జగిత్యాల పట్టణంలో ఓ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ మధ్యనే కోవిడ్ ఆసుపత్రిగా అనుమతులు లభించాయి. సదువుకున్నోడి కంటే ఆడు ఎవడో మేలు అన్నట్లు.. గీ.. డాక్టర్ చదువైతే సదివిండు గానీ.. వాడి ముద్ది మాత్రం గడ్డి తినింది. మెదడు మోకాళ్ళలో ఉంది. అందుకే వాడికి ఆడోళ్ళ వాసనా కావాల్సి వచ్చింది ఆ దరిద్రపు గొట్టు డాక్టర్ కు. అందుకోసం అక్కడ ఇక్కడ ఎందుకని ఆసుపత్రిలో పని చేస్తున్న సాటి నర్సు పైనే ఆ డాక్టర్ పాపపు కండ్లు పడ్డాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి. నర్సు కొవిడ్ పేషంట్లకు సంబంధించిన పరీక్షల రిపోర్టులను వైద్యుడు రాజేష్‌కు చూపించేందుకు గదిలోకి వెళ్ళింది. అంతటితో ఇదే అదును అని పసిగట్టిన ఆ కామాందుడు. నర్సుతో నీకు జీతం ఎంత ఇస్తున్నారని, ఇంతకంటే ఎక్కువ జీతం ఇప్పిస్తానని చెప్పి తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
కట్ చేస్తే.. ఆ వైద్యుడి పై, నర్సు కోరుట్ల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలిసులు డాక్టర్ ఆణిముత్యం పై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం రోజున సినాఫ్ ఎఫెన్స్ క్రింద డిఎస్పీ ఆసుపత్రిని పరిశీలించారు. ఆస్పత్రిలో పనిచేసే నర్సు పైనే వైద్యుడు ఇలా ప్రవర్తించడంతో తోటి సిబ్బంది, రోగులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడ చూసిన ఏమున్నది గర్వకారణం.. నిత్యం మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు, అక్రమాలు తప్పా.. సవుడుకున్నోడికి సదువుకోనోడికి తేడాలేకుండా పోయింది. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే అన్ని మర్చిపోతారు పోరికిగాళ్ళు.. పోరంబోకులు. తమ అక్క తమ చెల్లి ఒక ఆడదే కదా అని మరిచిపోతారు. మృగంలా పై బడుతారు.