ఉదయాన్నే ఇవి తింటే ఎంతో మేలు తెలుసా?

ఉదయాన్నే తీసుకునే ఆహారం ఆరోజు ఉత్సాహంగా ప్రారంభం కావడంలో కీలకంగా పనిచేస్తుందని ఆహార నిపుణులు,  వైద్యులు చెబుతుంటారు. చాలామంది ఉదయాన్నే కాఫీ, టీ,  గ్రీన్ టీ వంటివి తాగుతుంటారు.  అయితే ఐరన్ లోపం ఉన్నవారు వీటిని తీసుకుంటే శరీరం ఐరన్ గ్రహించడంలో సమస్య ఏర్పడుతుంది.  ఈ కారణంగా ఐరన్ ఆధారిత ఆహారాలు తిన్నా అవి శరీరం గ్రహించలేదు.  అందుకే ఐరన్ లోపం ఉన్నవారు ఉదయాన్నే  కొన్ని ఆహారాలు తినడం మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు.  అవేంటంటే..

డైటీషియన్ ప్రకారం  శరీరంలో ఐరన్ లోపం ఉంటే రోజూ ఉదయమే రెండు నానబెట్టిన ఖర్జూరాలను తినాలి.  ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.   శరీరానికి పుష్కలంగా ఐరన్ అందిస్తుంది.


 
గ్యాస్,  కడుపు ఉబ్బరం సమస్య నుండి బయటపడటానికి అర టీస్పూన్ సెలెరీని వేయించి నమలండి. సెలెరీలో క్రియాశీల ఎంజైమ్‌లు ఉంటాయి.  ఇవి కడుపులోని ఆమ్లాలను మెరుగుపరచడంలో అలాగే అజీర్ణం, ఉబ్బరం,  గ్యాస్ సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి.

 
ఎప్పుడూ   జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతుంటే ఉదయాన్నే 2 స్పూన్ల బయోటిన్ మిక్స్ తీసుకోవచ్చు. బయోటిన్ మిక్స్‌లో జింక్, మెగ్నీషియం,  బయోటిన్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి.


మొటిమలు, మచ్చలు,  పిగ్మెంటేషన్‌తో బాధపడుతుంటే నానబెట్టిన సబ్జా గింజలను అర టీస్పూన్ తీసుకోవచ్చు. సబ్జా గింజలను ఒక గ్లాసు నీటిలో 10-15 నిమిషాలు నానబెట్టి, ఈ నీటిని త్రాగాలి. ఈ నీటిని రోజూ తాగడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి.


 హైపో థైరాయిడిజం సమస్య ఉంటే ఉదయాన్నే బ్రెజిల్ నట్స్ తినవచ్చు.


బరువు తగ్గాలని ప్రయత్నించే వ్యక్తులు ఉదయాన్నే పాలతో టీ తాగకూడదు. బరువు తగ్గడానికి కింది విధంగా టీ తయారు చేసుకుని తాగాలి.

 ఒక చెంచా బ్లాక్ టీ, సగం దాల్చిన చెక్క, సగం నిమ్మకాయ రసం, ఒక చెంచా ఆర్గానిక్ తేనె,  4-5 పుదీనా ఆకులు  తీసుకోవాలి. ముందుగా ఒక కప్పు నీళ్లు మరిగించి అందులో బ్లాక్ టీ, దాల్చిన చెక్క ముక్క వేయాలి. 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత వడగట్టి కప్పులోకి తీసుకుని నిమ్మరసం, తేనె, పుదీనా ఆకులు వేసి గోరువెచ్చగా సిప్ చేస్తూ తాగాలి. ఈ టీలో జీరో కేలరీలు ఉంటాయి. దీని కారణంగా బరువు తగ్గడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాదు..  అపానవాయువు,  గ్యాస్ సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.


                                 *రూపశ్రీ.