సాదిక్ ఎందుకీ నోటి దురుసు?..క్షమాపణలు కోరిన కళిమొని
posted on Oct 28, 2022 @ 1:58PM
మహిళలను గౌరవించడం గురించి ప్రతీ వాళ్లూ ఉపన్యాసాలు ఇస్తూంటారు. మహిళలను గౌరవించని వారు ఎందుకు పనికిరారు వంటి ప్రవచనాలు రాజ్యం చేస్తున్నాయి. తప్ప వాస్తవానికి అలా ఏమీ జరగక పోవడమే విచారకరం. ఎక్కడ చూసినా మహిళలమీద అఘాయిత్యాలు, అవమానకర వ్యాఖ్యలు చేయ డం, అవమానించడం తప్ప మర్యాదగా ఉండడమన్నది కనపడటం లేదు, వినపడటం లేదు. ఇది క్రమేపీ రాజకీయాలకీ పాకింది. రాజకీయ నాయకులు కూడా విపక్షాల మహిళా నేతల మీద అరా కొరా కామెంట్లు చేయడం గమనిస్తున్నాం. ఇది ఇటీవలి కాలంలో మరింత పెచ్చు మీరింది. నేరుగానే కామెం ట్లు చేయడం మరీ దారుణం. తాజాగా తమిళనాడులో డిఎంకే నాయకుడు సాదిక్ బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ ని ఐటమ్ అని కామెంట్ చేయడం ఆశ్చర్యపరిచింది.
మంచి నటిగా పలు భాషా చిత్రాల్లో ఎందరో అభిమానులను సంపాదించుకున్నఖుష్బూ పై అసహ్యమైన కామెంట్లు చేయడం డిఎంకె పార్టీ నాయకుల పరిస్థితిని తెలియజేస్తుంది. నటిగా ఆమెకు వీరాభిమానులు ఉన్నారు. అంతేకాదు, ఆమెకు తమిళనాడులో ఏకంగా గుడి కట్టి మరీ తమ వీరాభిమానం ప్రకటించుకుం టున్నారు. ఈ స్థాయి గౌరవం తమిళ నాడులో లభించిన కాలంలో ఆమెను ఆమెతో పాటు నటీమణు లంతా అలాంటివారే అనడమే డిఎంకె నాయకుడు సాదిక్ కి మహిళలు, మహిళా రాజకీయనేతల పట్ల ఉన్న అసలు గౌరవాన్ని బయటపెట్టింది. అయితే డిఎంకే నాయకురాలు కనిమొళి మాత్రం క్షమాపణలు అడిగారు.
మహిళలను గౌరవించలేనివారు ప్రజాప్రతినిధులుగా ఉండడం పార్టీలకు, సమాజానికి అవమానకరమే. కానీ రాజకీయాలు వ్యక్తి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తన కంటే రాజకీయ బలానికే ప్రాధాన్యతనీయడం వల్ల నాయ కులు చాలామంది తమ వాక్చాతుర్యంలో భాగంగా ఇటీవల దారుణ భాషను మాట్లాడటం గమని స్తున్నాం. తిట్ల పురాణం వినపడుతోందే గాని మర్యాదగా కామెంట్లు చేయడం, విమర్శించడం అనేది వినపడటం లేదు, కనపడటం లేదు. దూషణకు, విమర్శించడానికి, బూతులు తిట్టడానికి మధ్య అంతగా తేడాలేకుండా పోతోంది. ఖుష్యూయే కాదు నటీమణులంతా ఐటమ్స్ అంటూ డీఎంకే నాయ కుడు కామెంట్ చేయడం అందుకు తాజా ఉదాహరణ. తెలుగు రాష్ట్రాల్లోనూ నాయకులు దారుణంగా మాట్లాడు తున్నారు. విపక్షాల్లోనివారి మీద విమర్శల పేరుతో నోటిదుడుసు ప్రదర్శిస్తున్నారు. అందు లోనూ అస హ్యంగా మాట్లాడటం, సంభోదించడం అనేవి చూస్తున్నాం, వింటున్నాం. కానీ అవేమీ ఆయా పార్టీల అధినేతలకు అంతగా పట్టకపోవడమే విచిత్రం.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి అను చిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ నాయకులు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మా రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఒక మహిళపై అంతటి దారుణమైన భాష వాడుతూ దుర్బాషలాడారంటూ వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ మేరకు సునీతా లక్ష్మా రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం పోరాడుతూ.. వారి కోసం నిరసనలు, ఆందోళనలు, దీక్షలు చేస్తుంటే.. మంత్రి కేటీ ఆర్, మంత్రి నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్ టీపీ నాయ కులు మండి పడ్డా రు. మంత్రి కేటీఆర్ వ్రతాలు అంటూ సంబోధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలు నిష్టగా చేసుకునే వ్రతాలను దీక్షకు ముడిపెట్టి వ్రతాలను చులకన చేశారని వైఎస్సార్ టీపీ నాయకులు ఆరో పించారు. ఈ వ్యాఖ్యలు అటు షర్మిలకు, ఇటు యావత్ మహిళా లోకానికి తీవ్ర అవమానకరం అని వారు అన్నారు. మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి నిరంజన్ రెడ్డి షర్మిలను మంగళవారం మరదలు అని అన్నారని పేర్కొన్నారు. మహిళలను చులకన భావంతో చూసే మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మా రెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.