మోడి చెప్పేవన్నీ అబద్దాలే
posted on Aug 12, 2013 @ 9:14PM
హైదరాబాద్‌లో జరిగిన నవభారత యువభేరి సభలో మోడి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విమర్శానాస్త్రాలను ఎక్కుపెట్టింది. ప్రత్యేక తెలంగాణపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ చెప్పిన వన్నీ అబద్దాలేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. మోడి సభలో చేసిన ప్రసంగంపై స్పందించిన దిగ్విజయ్, మోడి ఎప్పుడు వాస్తవాల ఆధారంగా మాట్లాడరన్నారు. తెలంగాణ పై బిజెపి స్పష్టమైన వైఖరి లేదన్న ఆయన తెలంగాణ, సీమాంధ్రపై మోడీ చెప్పినవన్నీ అబద్దాలే అన్నారు.
ప్రస్థుతం పదే పదే తెలంగాణకు మద్దతు పలుకుతున్న బిజెపి గతంలో తెలంగాణకు అంగీకరించలేదన్నారు.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వాని తెలంగాణ వద్దరన్న విషయం గుర్తు చేశారు. మోడి మాటల్లో కొత్తదనం ఏమి లేదన్న ఆయన మోడి సభ మామూలు రాజకీయ సభలాగే సాగిందని ఎద్దేవా చేశారు.
ఏపి ఎన్జీవోలను సమ్మె విరమించాలని కోరిన దిగ్విజయ్, సీమాంద్ర ప్రజలు తమ సమస్యలను ఆంటోని కమిటీతో చర్చించాలన్నారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమన్నారు. ఎన్జీవోలతో చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సుముఖంగానే ఉందన్నారు.