దిగ్విజయంగా కొడుకు నామినేషన్ దాఖలు

 

వడ్డించేవాడు మనోడయితే అన్నట్లు పార్టీ టిక్కెట్లు ఇచ్చేవాడు మనోడయితే పార్టీ అధికారికంగా అభ్యర్దుల పేర్లు ప్రకటించకపోయినా నామినేషన్ వేసుకోవచ్చును. కాంగ్రెస్స్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ కుమారుడు జయవర్ధన్ సింగ్ మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రఘోఘడ్ నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు తండ్రి (కాంగ్రెస్) హస్తం పట్టుకొని భారీ ఊరేగింపుతో నిన్న నామినేషన్ దాఖలు చేసారు.

 

దిగ్విజయ్ సింగ్ తను వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోనని చూచాయగా చెప్పడం వలన సహజ రాజకీయ న్యాయ సూత్రాలు, సిద్దాంతాల ప్రకారం ఆయన సీటు ఆయన కొడుకుకే దక్కాలి గనుక, జయవర్ధన్ సింగ్ నామినేషన్ వేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. అమ్మ దయ, యువరాజు మద్దతు అపారంగా కలిగి ఉన్న దిగ్విజయ్ సింగ్ ఆ మాత్రం చొరవ తీసుకోవడంలో వింతేమి లేదు కూడా.

 

జయవర్ధన్ సింగ్ రాజకీయ ఆరంగ్రేటం చేయడాన్ని, తండ్రి కుర్చీలో కూర్చోవలనుకోవడాన్ని, రేపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలను కోవడాన్ని కూడా తప్పుపట్టడం తప్పే అవుతుంది. అది తప్పయితే....