తెలంగాణ కాంగ్రెస్‌లో చీలిక?
posted on Aug 14, 2012 @ 12:11PM
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వని పక్షంలో తెలంగాణలో కాంగ్రెస్‌లో నిలిచే పక్షంలో చాలా మంది నాయకులు కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రకటించకపోతే ప్రజల ఎదుటకు వెళ్ళలేమని, అవసరమైతే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలనే యోచనలో కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ అనే పేరు లేకుండా తెలంగాణ పదం కలిపి ఒక కొత్త పార్టీ రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, జానారెడ్డి, మధుయాష్కీ తదితరులు కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితిలో కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ భావోద్వేగంపై ఎన్నికలకు వచ్చే పార్టీలకు, సంస్థలకు తెలంగాణలో తిరుగుండదు. అటు కాంగ్రెస్‌ను, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్‌ను, టిడిపిని ఎదుర్కొనేందుకు ఇదే మంచి కూటమిగా తెలంగాణ మేధావులు భావిస్తున్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉన్నది. టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలుస్తున్నది.