నెల్లూరు నాది.. ఆనం సంచలన కామెంట్స్
posted on Feb 15, 2021 @ 10:31AM
నెల్లూరు జిల్లాలో వైసిపిలో నడుస్తున్న వర్గపోరు సీఎం జగన్ కు సైతం చుక్కలు చూపిస్తోంది. అక్కడ మంత్రి అనిల్ కు సీనియర్ నేత ఎమ్మెల్యేరామనారాయణ రెడ్డికి ఏమాత్రం పోయసాగడం లేదు. దీంతో నిత్యం కీచులాటలతో రోడ్డెక్కుతున్నారు ఏపీలో తాజాగా జరుగుతన్న పంచాయతీ ఎన్నికలలో గెలిచినా మద్దతుదారులతో కలిసి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన 4 దశాబ్దాలుగా ఆనం కుటుంబం రాజకీయ జీవితం మొత్తం నెల్లూరుతో ముడిపడి ఉందని అయన అన్నారు. నెల్లూరు ప్రజలను కలవడానికి తమకు ఎన్నికలే కావాల్సిన అవసరం లేదన్నారు. పక్క జిల్లా అయినా ప్రకాశం లోని పొదిలి, దర్శి, కనిగిరి వరకూ వెళ్లి రాజకీయాలు చేసిన తమకు నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో రాజకీయం చేయడం పెద్ద కష్టం కాదన్నారు.నెల్లూరు నగరం నుండి గతంలో రాపూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు వెళ్ళామని.. తమను నెల్లూరు నుంచి ఎవరు దూరం చేయలేరని ఆనం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు పార్టీ అదినాయకత్వం ఎక్కడికి వెళ్లమంటుందో అక్కడికి వెళ్లక తప్పదని చెప్తూనే నెల్లూరుపై తమ మార్క్ మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏ పార్టీ నుంచి ఆనం కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నా.. నెల్లూరుతో అదే అనుబంధం కొనసాగిందని అయన స్పష్టం చేసారు .
ఇది ఇలా ఉండగా అనంత్ రామనారాయణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతోపార్టీలోని వర్గ విభేదాలు మరోసారి బయట పడడంతో నెల్లూరు వైసిపిలో కలకలం రేగుతోంది. పార్టీ అధిష్టానం తక్షణమే కలగచేయుకుని నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించాలని.. లేదంటే జిల్లాలో పార్టీ పుట్టి మునగడం ఖాయమని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.