డయాబెటిస్ లో హెచ్చుతగ్గులు ఆన్లైన్ ట్రీట్మెంట్...సురక్షితమా?
posted on Nov 25, 2021 @ 10:30AM
కోవిడ్ తరువాత ఆరోగ్య సంరక్షణ విషయం లో కోవిడ్ కు ముందు ఎలా ఉందొ ఇప్పుడు అలాగే ఉంది.కొన్ని రకాల నియంత్రణల మధ్య ఆసుపత్రులు కోవిడ్19 ను సమీక్షిస్తున్నాయి. ఇతర అనారోగ్య సమస్యలు వెనక్కి నెట్ట బడ్డాయి.ఇక వైద్య సేవలు ఆన్ లైన్ కావడం తో పట్టించుకునే వారే కరువయ్యారు. వారు చేస్తున్న చికిత్సలు సురక్షితమ? కాదా? అన్నది ప్రశ్న. ఇంటర్ నెట్ విస్తరించడం తో హెల్త్ పై రకరకాల యాప్ లు వస్తున్నాయి. ఇక వీటిని చూస్తున్న వారికి ఎన్నో సందేహాలు ప్రశ్నలు వేదిస్తున్నాయి.ఇవి సురక్షితమ కాదా? అన్నదే సందేహం. మరో వైపు ఆన్ లైన్ లో సమాచారం అందుతూ ఉండడం తో నిపుణులను సంప్రదించకుండానే చికిత్స చేసుకోవడం, మామూలు చికిత్స లేదా దీర్గకాలిక వ్యాధులకు కామినేషణ్ అఫ్ మెడిసిన్ వ్యక్తిని పరిశీలించకుండా ఎలా వైద్యం చేస్తారు. ఇక ఆన్ లైన్ ఆరోగ్యం పై ఎవరి పర్యవేక్షణ లేదు.
నియంత్రణ లేదు. ముఖ్యంగా ఇలాంటి ఆన్ లైన్ ట్రీట్ మెంట్ పై ఆడిట్ లేకపోవడం తో సలహాను తీసుకోవాలంటే నిశితంగా పరిశీలించండి అన్ లైన్ మ్యాప్స్ సరైనవా కాదో తెలుసుకోవాలి. వారి ప్రచార ఆర్భాటం ఎత్తుగడలు,చిత్ర విచిత్రంగా ఉంటాయి. వారు వైద్యరంగం లో ఏ మేరకు నైపుణ్యం ఉందొ తెలియదు కాని ప్రచార ఆర్భాటం అధికంగా ఉంటుయంది. ఉదాహరణకు డయాబెటిస్ జీవితాంతం ఉంటుంది.ప్రజలు సైతం పలు ప్రత్యామ్నాయ వైద్య ప్రక్రియలు వైపు చూస్తున్నారు.కొంత మంది అయితే మేము నయం చేస్తామంటూ వాగ్దానం చ్గేస్తున్నారు. అలాంటి వైద్యుల పై శ్రద్ధ చూపాల్సిన అవసరం వారి పై పూర్తినిగా అవసరం.
డయాబెటిస్ ఉన్న వారు వారి బరువు పెరగకుండా నియంత్రించుకోవాలి.ఇక డయాబిటీస్ ఉన్నవారిలో కొలస్ట్రాల్ లెవెల్స్,బిపి నియంత్రించుకోవాలి. దీర్ఘ కాలం గా తలెత్తే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నియంత్రించాలి.ఈ సమయంలో ఒక్కోసారి చక్కెర శాతం షుగర్ లెవెల్స్,బిపి వంటివి హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి.వైద్యులు ప్రతికేసునూ నిశితంగా పరిశీలించాలి. అసలు ఏ సమస్య కైనా నిర్దిష్టమైన వైద్య విధానం లేనందువల్ల నియంత్రణ లేనందువల్ల ఎవరికీ తోచిన పద్దతిలో వైద్యాన్ని అందిస్తున్నారు. అంతార్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ డయాబెటీస్ ను నిర్లక్ష్యం చేయవద్దని మరో రెండేళ్లలో 2 మిలియన్ల ప్రజలు డయాబెటీస్ బారిన పడవచ్చు నని హెచ్చరించింది.మరో రెండేళ్ళు ఇలాంగే డయాబెటిస్ నియంత్రణకు క్రుశిఅవసరమని ఫెడరేషన్ పేర్కొంది.ముఖ్యంగా అల్పాదయ,మధ్య తరాగతి వర్గాలు డయాబెటిస్ నుండి రక్షణ సాధ్యం కాకపోవడం గమనార్హం.
ఆయా వర్గాలు ఆసుపత్రికి వెళ్ళడం ప్రయాణ ఖర్చులు,అలాగే జనసమూహం లో క్యు లో నిలబడి డయాబెటిస్ రక్త పరీక్ష చేయించు కోవడం.కోవిడ్ సమయం లో అవసరమా?అని ప్రజలు ఆలోచిస్తున్నారు.దీనిని దృష్టిలో ఉంచుకుని టేలిమేడిసిన్ సౌకర్యాన్ని పెంచాల్క్సిన అవసరం ఉంది.కేంద్ర కుటుంబ సంక్షేమ బ్శాజ్హ మంత్రి ఆన్ లైన్ ఆసుపత్రుల పై నియమ నిబందనలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.నేరుగా ఇంటివద్దే రక్త పరీక్జ్ష లు ఆన్ లిన్ కాకుండా నేరుగా వైద్యుని కలిసేవీలు ఉన్నప్పుడే రోగి తమ సమస్యను చెప్పుకుంటాడని తద్వారా మేలైన వైద్యం అందుబాటులోకి వస్తే దీర్ఘ కాలిక రోగులకు మేలైన వైద్యం అందించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.