ఢిల్లీమోడల్ స్కూల్ బీజేపీయేతర కూటమికి బాట!
posted on Sep 6, 2022 @ 3:01PM
కాలేజీ చదువుకు వెళ్లే పేదపిల్లలకు తమిళనాడు ప్రభుత్వం నెలకు వెయ్యిరూపాయలు ఇవ్వడానికి సిద్ధపడింది. ఇది వాస్తవానికి ఢిల్లీ మోడల్ స్కూల్ అనుసరిస్తున్న పథకం. దీన్ని విజయవంతంగా, ఎంతో ఆమోదయోగ్యంగా అమలుచేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంతో అభినందించారు. సోమవారం (సెప్టెంబర్ 5)న ఈ పథకాన్ని కేజ్రీవాల్ సమక్షంలోనే తమిళ నాడు లో సీఎం స్టాలిన్ ఆరంభించారు.
అయితే, ఇటీవల దేశంలో తలెత్తిన రాజకీయ పరిణామాల దృష్ట్యా, స్టాలిన్ కేజ్రీవాల్ స్నేహం మున్ముం దు మరింత గట్టిపడి బీజేపీని ప్రశ్నించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల మాట. పంజాబ్‌లో ఆప్ విజ యం తర్వాత, ఆయన పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంతో ఆకర్షితులయ్యారు. ఇపుడు ఏకంగా ఢిల్లీ లో అమలు చేస్తున్న పథకాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేయడానికీ సిద్ధపడ్డారు.
రాష్ట్రాల మధ్య సుహృద్ వాతావరణం ఉండాలని, సహాయసహకారాలతో ముందడుగు వేయడం ద్వారా నే కేంద్రం, రాష్ట్రా లమధ్య కూడా సత్సంబంధాలకు అవకాశం ఉంటుందని కేజ్రీవాల్ ఈ సందర్భంగా అన్నారు. ఢిల్లీ పాఠశాల మోడల్‌ను తమిళనాట అమలు చేయడానికి స్టాలిన్ ఉత్సాహం ప్రదర్శించడం పట్ల కేజ్రీవాల్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కేజ్రీవాల్‌ను ఫైటర్ అంటూ స్టాలిన్ పొగడ్తలతో ముంచెత్తారు. కేజ్రీవాల్ ఐఆర్ ఎస్ వదిలి రాజకీయాల్లోకి రావడం నిజంగా అభినందనీయమని స్టాలిన్ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కావడం, ఇటీవలే పంజాబ్‌లోనూ తన పార్టీని విజయపథంలో నడిపించగలగడం అభినందనీయమన్నారు.
ఎంఆర్ ఏ మెమోరియల్ పుత్తుమాయిపెన్(ఆధునిక మహిళ) పథకాన్ని స్టాలిన్ ఆరంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6 ఉంచి10వ తరగతి వరకూ చదివిన ఆడపిల్లలకు ఉన్నతవిద్యకి వెళ్లేవారికి ప్రతీ నెలా వెయ్యిరూపాయలు అందజే స్తారు. తొలివిడతగా సుమారు 67 వేలమంది కాలేజీ విద్యార్థులకు అంద జేయనున్నారు.
దేశంలో పాఠశాల విద్యారంగంలో అభ్యున్నతి సాధించాలంటే కేంద్రం, రాష్ట్రాల మద్య సత్సంబంధాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అన్నారు. అనాదిగా పాఠశాల విద్యావిదానం, బోధనా విధానంలో మార్పలు కాలనుగుణంగా తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఆయన ప్రస్థావించారు. ఒకరాష్ట్రం నుంచి మరొకటి మంచి పథకాలను, విధానాలను అనుసరించడం ఎంతో అవసరమని కేజ్రీ వాల్ ఢిల్లీ, తమిళనాడు మధ్య స్నేహసంబంధాలు మరింత మెరుగుపడి ముందడుగు వేయాలన్న అభి ప్రాయం వ్యక్తం చేశారు.