ఢిల్లీ మద్యం కుంభకోణం...ముత్తాపై ఈడీ ప్రశ్నల వర్షం
posted on Oct 8, 2022 @ 10:30AM
ఢిల్లీ మద్యం కుంభకోణం నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈడీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటి వరకూ ఊహించని విధంగా ఇండియా అహెడ్ ఆంగ్ల వార్తా ఛానెల్ మీదా దాడులు చేపట్టడం ఒక్కసారిగా పత్రికా లోకం ఆశ్చర్యపరిచింది. తెలుగు దినపత్రిక ఆంధ్రప్రభ యాజమాన్యానికి సంబంధించిన ఈ ఆంగ్ల వార్తా ఛానల్ మీద ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో కొంతకాలం సేల్స్ విభాగం అధిపతిగా ఉన్న అర్జున్ పాండే కుంభకోణంలో కీలకపాత్ర వహించడం మరింత వెలుగులోకి వచ్చింది. అలాగే ఇందులో మరొక కీలక వ్యక్తిగా భావిస్తున్న బోయినపల్లి అభిషేక్ కూడా ఆంధ్రప్రభ ఇండియా అహెడ్‌లో పెట్టుబడు లు పెట్టారన్నది బయటపడింది. ఈ నేపథ్యంలోనే పక్కా ఆధారలతో శుక్రవారం ఆంధ్రప్రభ యజమాని ముత్తా గోపాల కృష్ణను ఈడీ ప్రశ్నించింది.
శుక్రవారం ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్‌లతో పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో ఈడీ తాజా దాడులు చేప ట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని ఆంధ్రప్రభ కార్యాలయంపైనా సాయింత్రవరకూ సోదాలు చేశారు. మరీ ముఖ్యంగా అసలు ఈ కుంభకోణంలో కీలకంగా భావిస్తున్న అర్జున్ పాండేకు ముత్తా గోపాల కృష్ణ కుటుంబం నిర్వహిస్తున్న ఆంగ్ల ఛానల్‌కి సంబంధాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు. అంతేగాక,
ఢిల్లీలో ఉప ముఖ్యమత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడుగా భావిస్తున్న దినేశ్ అరోరా, హైదరాబాద్‌లో అభినవ్(మాదాపూర్), శరత్ చంద్ర(కూకట్‌పల్లి) ఇళ్లపైనా దాడులు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపా రు. గతంలో అరెస్టు చేసిన సమీర్ మహేంద్రు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి.
తెలంగాణా అధికార టీఆర్ ఎస్ పార్టీ ముఖ్యనేతలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న బోయిన్‌పల్లి అభి షేక్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ గతంలో దాడి చేసినపుడు లిక్కర్ స్కామ్‌లో ఏ-14గా ఉన్న రామ చంద్ర పిళ్లై సంస్థల్లో అభిషేక్ భాగస్వామిగా ఉన్నట్టు తెలిపే ఆధారాలు లభించాయి. ఇపుడు తాజాగా ఇండియా అహెడ్ సంస్థలో అభిషేక్ డైరెక్టర్‌గా ఉన్నసంగతి వెలుగుచూసింది. ముత్తా గోపాలకృష్ణ కుమా రుడు గౌతమ్తో పాటు అభి షేక్ జేఈయూ ఎస్ నెట్‌వర్కింగ్ ప్రయివేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థ కు 2021 నుంచీ అభిషేక్ డైరెక్టర్‌గా ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏ-15గా ఉన్న అర్జున్ పాండే అక్కడి మీడియాకు కీలకంగా వ్యవహరించినట్టు సిబీ ఐ ఆరోపించింది. ఇండోస్పిరిట్ సంస్ఠ ఎండీ సమీర్ మహేంద్రు నుంచి ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ సీఈవో విజయ్ నాయర్ తరపున అర్జున్ పాండే కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. జూబ్లీహిల్స్ కార్యాలయంలో సోదాల్లో పలు పత్రాలు సాంకేతిక ఆధారాల్ని ఈడీ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి గచ్చిబౌలిలోనూ ఈడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి.