భార్యపై అనుమానం.... 24 సార్లు పొడిచి చంపిన భర్త..
posted on Sep 12, 2016 @ 11:29AM
ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తన భార్యపై అనుమానంతో అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు భర్త. వివరాల ప్రకారం.. ఢిల్లోలోని వికాశ్ విహార్ నగర్ లో ఇ-రిక్షా డ్రైవర్ అయిన ప్రేమ్‌సింగ్.. తన భార్య సుమన్‌కు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. దీంతో తనను చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. దానిలో భాగంగానే ముందుగానే వారి పిల్లలను తన బంధువుల ఇంట్లో ఉంచి.. ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 24 సార్లు ఆమెను అతి కిరాతకంగా పొడిచి పొడిచి చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరికీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే చనిపోగా.. ప్రేమ్‌సింగ్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రేమ్‌సింగ్ పై మర్డర్, సూసైడ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.