ఫిబ్రవరిలోనే పెళ్లి, అంతలో........

 

 

 

ఢిల్లీ లోని ఓ ప్రైవేటు బస్సులో దారుణంగా రేప్ కు గురి అయి, చివరకు మరణించిన 23 సంవత్సరాల ఆ పారా మెడికల్ స్టూడెంట్ కి వచ్చే ఫిబ్రవరి లో వివాహం జరగనుంది. వరుడు, ఆమెతో పాటు ఆగంతకుల చేతుల్లో బస్సులో దెబ్బలు తిన్న యువకుడు.

 

ఆమె నివసిస్తున్న ఇంటి ఇరుగుపొరుగు వారు అందించిన వివరాల ప్రకారం, తన వివాహం కోసం ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకుంది. పెళ్లి విందు ఢిల్లీ లోనే చేయడానికి తగిన ఏర్పాట్లు కూడా ఆ కుటుంబం చేసుకుంది. ఆమె వివాహం ఫిబ్రవరిలో జరగనుందని మాకందరికీ తెలుసని వారు అన్నారు.



రేప్ జరిగిన ఆ రోజు తన స్నేహితుడితో షాపింగ్ కు వెళ్ళిందని. అటునుండి అటు వారిద్దరూ సినిమా కు వెళ్లారని బాధితురాలి బంధువు ఒకరు అన్నారు. వివాహానికి కావాల్సిన బట్టలు కొనడానికి ఇటీవలే తమను షాపింగ్ కు తీసుకు వెళ్ళిందని ఆమె ఇంటి పొరుగు మహిళ ఒకరు మీడియా తో అన్నారు.


ఆ బస్సులో ఆమె ఆ ఆరుగురు కీచకుల బారిన పడకుండా ఉండి ఉంటే, జనవరి లోనే ఆమె నిశ్చితార్ధం కూడా జరిగేది.