డేవిడ్ వార్నర్ మళ్లీ చేసేశాడు
posted on Nov 17, 2022 @ 10:41PM
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్..సామాజిక మాధ్యమంలో చాలా చాలా యాక్టివ్ గా ఉంటారు. అంతకు మించి తెలుగు రాష్ట్రాల క్రీడాభిమానులు, సినీ అభిమానులకు డేవిడ్ వార్నర్ చాలా చాలా దగ్గరైపోయాడు. ఐపీఎల్ లో గతంలో హైదరాబాద్ జట్టుకు కేప్టెన్ అయినందుకే కాదు.. వార్నర్ తెలుగు సినీ నటుల పాపులర్ పాటలు, డైలాగ్స్ స్కూఫ్ చేసి వాటిని సామాజిక మాధ్యమంలో ఉంచడం ద్వారా కూడా తెలుగు ప్రజలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.
తాజాగా డేవిడ్ వార్నర్ మరో స్కూఫ్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టాడు. వెంటనే అది తెగ వైరల్ అయిపోయింది. నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు. అయితే ఈ సారి షేన్ వార్న్ నటి రష్మికకు సారీ చెప్పి మరీ స్కూఫ్ చేశాడు. ఇంతకీ సారీ ఎందుకంటే షేర్ వార్న్ స్కూఫ్ చేసిన పాట బీష్మ చిత్రంలో రష్మిక చేసినది. అందుకే అలా స్కూఫ్ చేసినందుకు క్షమించాలంటూ డేవిడ్ వార్న్ ముందుగా రష్మికకు క్షమాపణలు చెప్పారు.
అయితే డేవిడ్ వార్న్ యాక్ట్ రష్మిని కించపరిచేదిగా ఎంత మాత్రం లేదని నెటిజన్లు అంటున్నారు. విపరీతంగా లైకులు కొడుతున్నారు. ఇలా ఉంటే.. క్రికెట్ తెలిసిన వారికి వార్న్ పరిచయం అక్కర్లేని పేరే. అలాగే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్ గా కూడా వ్యవహరించడంతో టాలీవుడ్ సినిమాలూ, హీరోలపై చక్కటి అవగాహన సైతం ఉందనడానికి గతంలో ఆయన తెలుగు హీరోలను నటులను అనుకరిస్తూ చేసిన స్కూపులే నిదర్శనం.
బాహుబలిలో ప్రభాస్ డైలాగ్ నుంచి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టెప్‌ల వరకు డేవిడ్ వార్నర్ చేసిన స్కూపులన్నీ నెటిజన్ల మన్ననలు పొందాయి. ఇన్నాళ్లు హీరోల ముఖాలని మార్ఫింగ్ చేసి నెటిజన్లని అలరిస్తూ వచ్చిన డేవిడ్ వార్నర్.. తాజాగా తొలిసారిగా హీరోయిన్ రష్మిక స్ఫూఫ్ చేశాడు.