ప్రజా క్షేత్రంలో లోకేష్ నడక.. పాదయాత్రకు ముహూర్తం ఖరారు
posted on Nov 11, 2022 @ 2:55PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న పాదయాత్రకు ముహూర్తం ఖరారు అయింది. 2023, జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఈ పాదయాత్రను ఆయన చేపట్టనున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఈ పాదయాత్ర పూర్తి కానుంది. ఈ పాదయాత్ర ద్వారా దాదాపు 450 రోజుల పాటు లోకేశ్.... ప్రజల మధ్య ఉండే విధంగా రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ పాదయాత్రలో లోకేశ్.. ఓ వైపు ప్రజల సమస్యలు తెలుసుకొంటూ.. మరోవైపు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ముందుకు సాగనున్నారని సమాచారం. ఆ క్రమంలో యువత, మహిళలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోకేశ్ తనదైన శైలిలో గళం విప్పనున్నారని తెలుస్తోంది. అయితే లోకేశ్ పాదయాత్రకు సంబంధించిన విధివిధానాలన్నింటిని నవంబర్ నెలాఖరులోగా ఫైనల్ అయ్యే అవకాశం ఉందని సైకిల్ పార్టీలో ఓ చర్చ అయితే జరుగుతోంది. అయితే ఈ పాదయాత్రలో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు సాగేందుకు లోకేశ్.. తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే లోకేశ్ పాదయాత్ర విజయవంతం అయ్యేందుకు.. చంద్రబాబు ఇప్పటికే రంగంలోకి దిగి.. తనదైన చాణక్యానికి పదును పెడుతున్నట్లు సమాచారం. మరోవైపు లోకేశ్.. తాను చేపట్టే ఈ పాదయాత్రలో ఎక్కడా విరామం అనేది లేకుండా... వారంలో ఏడు రోజులు కొనసాగిస్తారని తెలుస్తోంది. అలాగే 175కి 175 నియోజకవర్గాలను టచ్ చేసుకొంటూ ఆయన.. తన పాదయాత్రను సాగించేందుకు లోకేశ్.. తన కార్యాచరణ సిద్ధం చేసుకొంటారని తెలుస్తోంది. 2024 ఫిబ్రవరి చివర వారం లేదా మార్చి మొదటి రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ప్రజల మధ్య ఉండేందుకు నారా లోకేశ్.. కృత నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.
అలాగే ఈ పాదయత్ర వల్ల లోకేశ్ ఓ వైపు పార్టీపై పట్టు పెంచుకొవడమే కాకుండా.. మరోవైపు ప్రజలతో మమేకమయ్యేందుకు దోహదం చేస్తుందనే ఓ భావన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబులో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలోని క్షేత్రస్థాయి పరిస్థితులనే కాదు.... ప్రజల సమస్యలను సైతం నేరుగా తెలుసుకొనే అవకాశం నారా లోకేశ్‌కు దక్కుతోందని సమాచారం.
అదేవిధంగా జగన్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకొని నారా లోకేశ్.. ఈ పాదయాత్రలో ప్రసంగించనున్నారని తెలుస్తోంది. అలాగే రోడ్ షోలు, బహిరంగ సభలకు సైతం లోకేశ్.. ప్రణాళికలు సిద్ధం చేస్తుకొంటున్నారు. టీడీపీకి కంచుకోటు లాంటి నియోజకవర్గాల్లో మరింత బలంగా చొచ్చుకెళ్లేందుకు లోకేశ్ సమయత్తమైనట్లు తెలుస్తోంది. అలాగే వైసీపీకి బలమైన నియోజకవర్గాల్లో సైతం రోడ్డు షోలు, బాదుడే బాదడు తదితర కార్యక్రమాలతోపాటు బహిరంగ సభలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.