ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
posted on Oct 8, 2025 @ 8:58PM
బ్యాంకు అకౌంట్లు తెరిచి ఇస్తే డబ్బులు ఇస్తాం.... బ్యాంక్ అకౌంట్లు ఇస్తే మనకెందుకు డబ్బులు వస్తాయని అనుకోవచ్చు.. కానీ ఇది నిజం ..కుబేర సినిమా తరహాలోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్ప డుతున్నారు.. ఈ సైబర్ నేరగాళ్లు అడ్డ మీద ఉన్న కూలీలను మాత్రమే టార్గెట్‌గా చేసుకొని వారికి డబ్బుల ఎరగా వేసి బ్యాంకు అకౌంట్లను తెరిపిం చుకుంటున్నారు.
కొంతమంది వ్యక్తులు అయితే నేరుగా కూలీలు ఉండే అడ్డా వద్దకు వెళ్లి అక్కడ ఉన్న కూలీలతో మాటామంతి కలుపుతారు. బ్యాంకు అకౌంటు తెరిచి ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని నమ్మిస్తున్నారు. ఇందు కొరకు మీ ఆధార్ కార్డు తీసుకొని రావాలని చెప్తారు... వారి మాటలు నమ్మిన కూలీలు డబ్బుల కోసం బ్యాంకు అకౌంట్లు తెరిచేం దుకు సిద్ధమవు తారు.
ఆధార్ కార్డు తీసుకొని వచ్చిన కూలీలను నేరుగా బ్యాంకుకు తీసు కెళ్ళి బ్యాంకులో అకౌంట్ ని తెరిపి స్తారు.ఆ తరువాత ఈ ముఠా బ్యాంకు పాస్ బుక్కు, ఏటీఎం కార్డులు రాగానే వీటన్నిటిని కలెక్ట్ చేస్తారు... ఈ తతంగమంతా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతుంది... అవునండోయ్ ఇది నిజం... ఇలా కుబేర సినిమా తరహాలో మోసాలకు పాల్పడుతున్న నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న కూలీలే టార్గెట్
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అడ్డా మీద ఉన్న కూలీలను టార్గెట్ గా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి బ్యాంకు అకౌంట్లను తెరిపి స్తున్నారు.ఆ తర్వాత పాస్ బుక్, ఏటీఎం కార్డులను నేరుగా కర్ణాటక కు పంపిస్తారు ..అది కూడా కేవలం బస్సులోనే పంపిస్తారు. ఎవ్వరి కి కూడా ఇక అకౌంట్లు తెరిపిం చినట్లు తెలియదు.బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చినందుకు ఈ మూట కూలీలకు డబ్బులు ఇస్తుంది. ఇక్కడతో వీళ్ళ పని అయిపోతుంది.
ఇప్పుడు అసలు కథ మొదలైంది.
ఆ ముఠా నేరుగా ఒక కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోని ఈ బ్యాంకు అకౌంట్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తుంది. ఈ బ్యాంకు అకౌంట్లుల న్నింటినీ కూడా బెట్టింగ్ యాప్లకు కనెక్ట్ చేస్తారు.. ఈ బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు వచ్చిన తర్వాత వాటిని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత డబ్బు తీసుకొని వెళ్ళిపో తారు.. సైబరాబాద్ లోని ఎస్వోటీ పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం తో కర్ణాటకలో ఉన్న ముఠాపైన నిఘా పెట్టారు. ఈ ముఠా నేరుగా ఒక కాల్స్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోనీ దాని ద్వారా బెట్టింగ్ యాప్స్ నిర్వహి స్తుంది
..బెట్టింగ్ యాప్ ల ద్వారా వచ్చే డబ్బులన్ని టిని కూడా అడ్డా మీద కూలీల ద్వారా ఓపెన్ చేయించిన అకౌంట్లోకి మళ్ళీ స్తారు ..ఆ అకౌంట్లోకి డబ్బులు రాగానే వీటిని క్లోజ్ చేస్తారు అయితే ఇప్పుడు వరకు దాదాపు ఒక సైబరాబాద్ పరిధిలోనే వందల కొద్దీ నకిలీ బ్యాంకు అకౌంట్లు తెరిపిం చినట్లుగా పోలీ సులు గుర్తించారు. నకిలీ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫా రమ్‌ల ద్వారా అమాయకులను మోసం చేస్తున్న దొప్పలపూడి నవీన్ కుమార్, వంకద్రి సందీప్ కుమార్, చింతల పాటి ప్రుధ్వి రామ రాజు,చింతల పాటి పవన్ వెంకట నాగ భారద్వాజ్, మామిడి శెట్టి రామాంజనేయులుఅనే ఐదుగురు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సైబర్ క్రైమ్ పోలీసులు, ఎస్ఓటీ సిబ్బంది సంయుక్తం గా ఈ ఆపరేషన్ చేపట్టారు. నిందితులు నకిలీ గేమింగ్ యాప్‌లను రూపొందించి, ఆకర్షణీయమైన లాభాలు చూపిస్తూ బాధితులను మోసగించేవారని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు సైబర్ గ్యాంగ్‌కు సరఫరా చేసినట్లు విచారణ లో వెల్లడైంది.ఈ గ్యాంగ్ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా 120 కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి నకిలీ లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వీరు సత్యనారాయణ వర్మ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పని చేసేవారని.... “Dodge book777” అనే గేమింగ్ పోర్టల్ ద్వారా డబ్బులు మళ్లించారని అధికారులు వెల్లడించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 ల్యాప్‌టాప్‌లు, 30 మొబైల్ ఫోన్లు, 32 చెక్ బుక్స్, 23 ఏటీఎం కార్డులు, 48 సిమ్ కార్డులు, 14 లక్షల నగదు , సంబంధిత ఖాతాలను సీజ్ చేసినట్లు అధికా రులు తెలిపారు.ప్రజలు తమ OTPలు, PINలు, బ్యాంక్ వివరాలను ఎవరికీ ఇవ్వకూ డదని, ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను ఉప యోగించకుండా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.