సీపీఐ నారాయణ సోనియా నుంచి ఎన్నికోట్లు తీసుకున్నాడో
posted on May 15, 2014 @ 6:56PM
ఖమ్మం పార్లమెంట్ స్థానంలో తనను ఓడించడానికి సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం జగన్ నుంచి 15 కోట్లు తీసుకున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చేసిన ఆరోపణని సీపీఎం నాయకులు ఖండించారు. నారాయణ చేసిన ఆరోపణలు జుగుప్సాకరం, నిరాధారమని సీపీఎంపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఊహాజనిత ఆరోపణలు చేయడం కమ్యూనిస్టు పార్టీ లక్షణం కాదని ఆయన చెప్పారు. తమ్మినేని వీరభద్రం జగన్ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తున్న నారాయణ దానికి సంబంధించిన ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. నారాయణ చేసిన ఆరోపణలు నిజమని తేలితే తమ జాతీయ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా రాఘవులు నారాయణ విలువ రూ.15 కోట్లేనా? ఆయన విలువ రూ. 150 కోట్లదాకా ఉంటుంది అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అలాగే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని సీపీఐ నారాయణ కాంగ్రెస్, సోనియాగాంధీ నుంచి ఎన్ని కోట్లు తీసుకున్నారో లెక్క చెప్పాలని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు.