అన్ని జిల్లాల్లో ఓట్ల లెక్కింపు సన్నాహాలు పూర్తి: భన్వర్‌లాల్
posted on May 15, 2014 @ 6:46PM
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఆరోజు రానే వచ్చింది. సుదీర్ఘంగా జరిగిన ఎన్నికల ప్రక్రియ తర్వాత దేశంలో, రాష్ట్రంలో రాజకీయ నాయకుల, ప్రజల తలరాతను నిర్ణయించే కీలకమైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం జరగబోతోంది. ఉదయం ఎనిమిది గంటలనుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అరగంట పాటు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం ప్రారంభమవుతుంది. ఎన్నికల లెక్కింపు ఏర్పాట్లు రాష్ట్ర వ్యా్ప్తంగా పూర్తయ్యాయని, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పారు. గురువారం అర్ధరాత్రి నుంచి అన్ని మద్యం దుకాణాలు బంద్ చేయడానికి ఆదేశాలు జారీ చేశామని భన్వర్ లాల్ తెలిపారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందించే ఏర్పాటు చేశామని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని భావిస్తున్నామని భన్వర్ లాల్ చెప్పారు.