రాష్ట్రం కరోనా నిలయం..
posted on Apr 6, 2021 @ 9:48AM
కరోనా దెయ్యం లా ప్రజల మీద విరుచుకు పడుతుంది. రోజు రోజుకి కేసులు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా చుక్కలు చూపిస్తుంది.. కొన్నీ రోజులు మనశాంతిని ప్రసాదించిన కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలను చిత్తూ చేస్తుంది. గడిచిన 24 గంటల్లో 62,350 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో మరో ఆరుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,729కి చేరింది. కరోనా బారి నుంచి 2452 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,013కి చేరింది. ప్రస్తుతం 9,993 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 5,323 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 313 కేసులు నమోదయ్యాయి.
ఆ గ్రామంలో స్వచ్చందంగా లాక్ డౌన్
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండలో గ్రామస్తులు స్వచ్ఛంద లాక్‌డౌన్ ప్రకటించుకున్నారు. పదిహేను రోజుల పాటు లాక్‌డౌన్ అంటూ గ్రామపెద్దలు సోమవారం రాత్రి దండోరా వేయించారు. అంతేగాకుండా.. తమ గ్రామంలోకి ఈ పదిహేను రోజులు ఎవరూ రావొద్దని గ్రామస్తులు విజ్ఞప్తులు తెలుపుతున్నారు.