బయటికి వస్తే మటాషే ..
posted on Apr 16, 2021 @ 11:14AM
దేశాన్ని దివాళా తీస్తుంది కరోనా.. ప్రజలను గడగడలాడిస్తోంది.. మాస్కు మాత్రమే కరోనా నుండి శ్రీ రామ రక్ష.. కానీ ఎవరు సీరియస్ తీసుకోవడం లేదు. కరోనా మాత్రమే సీరియస్ తీసుకుంది. అందుకే మనుషులు హాస్పటల్ లో చేరుతున్నారు. శవాల కుప్పలు స్మశానాని చేరుతున్నాయి. ఇప్పటికే మన దేశం కరోనా లో రెండొవ స్థానంలో నిలిచింది. గడచిన 24 గంటలలో తాజాగా మరో 2,17,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 1,185 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 97,866 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917లకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 15,69,743గా ఉంది. కరోనా నుంచి 1,25 47,866 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,74,308కు చేరుకుంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 27,30,359కి చేరుకున్నట్లు శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది.
తెలంగాణలో కరోనా విలయం..
ఇక తెలంగాణలో కూడా కరోనా కేసులు ఊపు అందుకున్నాయి.. వందలు దాటి వేయిల సంఖ్యలో పరుగెడుతోంది. ఈ నగరానికి ఏమైంది.. ఒక వైపు కరోనా అయితే.. దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు.. పది మంది ఉన్న చోట ఒక్కడికి కూడా మాస్కు లేదు. కనీస జాగ్రత్తలు పాటించడం లేదు.. మాస్కులు లేవు. సామాజిక దూరం లేదు. శానిటైజర్ లేదు. ఇలాగే ఉంటే ఈ నిర్యక్ష్య ధోరణికి తప్పదు భారీ మూల్యం. ఆ మూల్యమే మీ ప్రాణం కావచ్చు నా ప్రాణం కావచ్చు. కరోనా విరుచుకుపుతున్న నేపధ్యం లో ఇప్పటికి హైదరాబాద్ సగం కాళీ అయింది.. ట్రాఫిక్ తో రద్దీగా ఉందట రోడ్లు మళ్ళీ కరోనా విజృంభిస్తుండడం. మళ్ళీ ప్రజలు కరోనా నుండి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఊరి బాట పడుతున్నారు. వలస కూలీలు కూడా తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు. నిన్న రాత్రి 8గంటల వరకు 1,21,880 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 3,840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 9 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,797కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1198 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,09,594కి చేరింది. ప్రస్తుతం 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 20,215 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 505 కేసులు నమోదయ్యాయి.