భారత్ బయోటెక్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తొలిదశ విజయవంతం
posted on Jul 21, 2020 @ 6:06PM
కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కొన్నేందుకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ తొలిదశ విజయవంతమైంది. దేశంలోని 12 కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. హైదరాబాద్ లోని నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఇద్దరు వ్యక్తులకు వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిద్దరినీ రెండు రోజుల పాటు ఐసియులో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని గమనించారు. రెండు రోజుల డాక్టర్ల పర్యవేక్షణలో వారిలో ఎలాంటి అలెర్జీలు, సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. దాంతో తొలి దశ క్లినికల్ ట్రయల్స్ లో మొదటి అంకం పూర్తి అయ్యింది. వీరిద్దరినీ ఈ రోజు నిమ్స్ నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. మరో 12రోజుల పాటు వారి ఆరోగ్యపరిస్థితిని గమనిస్తారు. ఆ తర్వాత రెండో దశ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తారు.
తొలి దశలో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరూ ఆరోగ్యవంతంగా ఉండటంతో మరో 24మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం 60మందికి తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వడానికి శాంపిల్స్ సేకరించారు. దేశ వ్యాప్తంగా 12 కేంద్రాల్లో 375మందికి తొలిదశ వ్యాక్సిన్ ఇస్తారు.