వంటింటి ఫ్లోరింగ్ తవ్వితే బంగారునాణాలు దొరికాయ్!
posted on Sep 2, 2022 @ 12:52PM
పిల్లలు ఆడుకునేప్పుడు ఏ మూలో చెంచానో, గ్లాసో దొరికితే అయ్యో దీనికోసం రెండు రోజులుగా వెతుకుతున్నార్రా.. అంటూ అమ్మో, అమ్మమ్మో తెగ ఆశర్యపోతూ అందుకుంటారు. ఇల్లు కట్టే యత్నం లో తీసే గుంటల్లో లంకె బిందెలు దొరికిన సంఘటనలూ చాలా గ్రామాల్లో జరిగాయి. అలాంటిది రూ.2.3 కోట్ల విలువయిన బంగారు నాణాలే దొరికితే !
ఇంగ్లండ్ నార్త్‌యార్క్‌షైర్‌లో దంపతులు తమ ఇంట్లో వంటింటి ఫ్లోరింగ్ బాగుచేయించుకోవాలని పను లు మొద లెట్టారు. కొంచెం తవ్వగానే ఘల్లుమని శబ్దం వినపడింది. ఏందిరా అయ్యా అని పెద్దాళ్లిద్దరూ చూస్తే చిన్న కుండలాంటిదాంట్లో ఏకంగా 264 బంగారు నాణాలు దర్శనమిచ్చాయి. అంతే వారి ఆనం దానికి అంతే లేదు. ఇది ఊహించని దైవకృప అనుకున్నారు. అయితే అవి సుమారు 400 సంవత్సరాల నాటివి అని అధికారులు, వేలంలో వాటిని కొన్నవారు తేల్చారు. ఈ నాణాల మట్టికుండను చూడగానే దంపతులు వాటిని తీసి దాచలేదు. వెంటనే లండన్ ప్రముఖ వేలం సంస్థ స్పింక్ అండ్ సన్ అధికారు లకు ఈ సంగతి తెలియజేశారు.
ఆ దంపతులు పదేళ్లకు పైగా ఆ భవనంలో ఉంటున్నారు. పదేళ్ల క్రితం ఆ భవనాన్ని కొన్నారట. కానీ వంటింటి ఫ్లోరింగ్ పాడయి నానా ఇబ్బందులూ పడుతుండేవారు. కొంతసొమ్ము పోగుచేసి బాగు చేయిం చాలనుకున్నారు. ఊహించనివిధంగా తవ్వకంలో ఈ నాణాలు బయటపడ్డాయి. అసలు చిన్న మట్టి కుండలో అన్ని నాణాలు ఎలా పెట్టారన్నది అధికారులు చూసి ఆశ్చర్యపడ్డారు. ఈ నాణాలు 1610, 1727 మధ్య కాలం నాటివని పరిశీలకులు తేల్చారు. అవి జేమ్స్ 1, ఛార్లెస్ 1, జార్జ్ 1 కాలానికి చెందినవిగా పేర్కొన్నారు.