లావుగా ఉన్నాడని వదిలేసింది.. తగ్గాక బాధపడింది!
posted on Sep 2, 2022 @ 2:30PM
తెరమీద కండలవీరుడు సల్మాన్ కనపడగానే ఈలలగోల, చెర్రీ కరపడగానే తెరమీదకి కాయితాలు, పూల జల్లు. హీరో సిక్స్‌పాక్‌లో ఉండాలి, విలన్ ఎలా ఉన్నా పర్వాలేదు, కమెడియన్ బొజ్జతోనే ఉండాలి.. ఇలాంటి కొన్ని సూత్రాలు స్టాండర్డ్‌గా పాటిస్తున్నాయి సినిమాలు. అవే కావాలనుకుంటున్నారు అమ్మా యిలు. కలలో రాకుమారుడు, పక్కింటి కుర్రాడు ఎవరయినా సరే చచ్చినట్టు సిక్స్‌పాక్ తోనే ఉండాలి. లేకపోతే నిద్రాపట్టదు, పక్కింటి వేపు చూడరు. మరంచేత కుర్రాళ్లకు ఇదో శిక్ష. లేకపోతే ఇదుగో పువీ లానే లవర్ దూరమవుతుంది. తర్వాత ఏ ప్యాక్ తెచ్చుకునీ ప్రయోజనం ఉండదు!
అయినా ఇపుడు యూత్ అంటే స్పోర్ట్స్ బైక్, సిక్స్‌ప్యాక్ తోనే కనపడాలి. అలానే కాలేజీలు, ఆఫీసుల్లో రాజ్యం ఏలుతున్నారు. లేకపోతే అమ్మాయిలు పట్టించుకోరన్న గట్టి నమ్మం వారికీ ఉంది. ఏ వయసులో పని ఆ వయసులో కానిచ్చేయాలన్నారు ప్రేమికులను ఉత్సాహపరిచే సిద్ధాంతులు. అందుకే వీధికో చెర్రీ, సల్మాన్‌లు ఎదురవుతుంటారు. లేకపోతే పట్టణానికే అవమానం అనే జనం కూడా ఉన్నారు!
పువీ టిక్‌టాక్ హీరో. అతను మంచి నటుని గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమాంతం ఓ అమ్మాయి ప్రేమించేసింది. తీరా పరిచయంచేసుకుని అలా బైక్ మీద తిరగాలనుకుంది మిల్కీబ్యూటీలా! కానీ ఆమె ఆశలు నిరాశయ్యాయి, కన్న కలలు కరిగిపోయాయి. మనోడు నటుడే కాని సల్మాన్, చెర్రీ కాకపోయే. అవును పువీ మంచి నటుడే తప్ప బాడీ పెద్దగా మెయిన్‌టేన్ చేయలేదు. అందువల్ల ఇద్దరు పిల్లల తండ్రిలా తయారయ్యాడు, బొజ్జతో. అతన్ని చూసి అయ్యో వీడు నా పువీ కాదు అనుకుంది ఆ పిల్ల. తర్వాత నేనే ఫోన్‌లో ఇన్ని రోజులు మాట్లాడింది, ప్రేమ వ్యవహారం ప్రోపోజ్ చేసిందీను.. అని అనే శాడు. ఆమె ఖంగారు పడింది. ఈ దిబ్బవాడినా నేను కోరుకుంది. ఛా.. చెర్రీ అనుకున్నా. సారీ అనేసింది పువీకి ఆ పిల్ల.
అంతే మనోడు చెలిమి లేదు.. చెలియలేదు.. అంటూ పాడుకోబోయాడు. కానీ పక్కింటి బాబాయిగారు, వీధిలో బాడీబిల్డింగ్ ట్రయినర్ పిలిచి అబ్బాయి బాడీ తగ్గించుకోను చిట్కాలున్నాయి. పాటించమన్నారు. అంతే మనోడు విపరీతంగా కష్టపడ్డాడు. టిక్ టాక్ షోలు చేస్తూనే మరో వంక ఆ పిల్ల మీద పగ తీర్చుకోవాల నుకున్నాడు. ఆరు నెలల తర్వాత అనూహ్యంగా శరీరంలో ఎంతో మార్పు వచ్చిం ది. నిజంగానే మనోడు సల్మాన్ అయిపోయాడు. తనను అద్దంలో చూసుకుని తానే నమ్మలేక పోయాడు. ఎదురింటి పిల్ల దొంగ తనంగా చూస్తున్నపుడు అవును నిజమే అనుకున్నాడు. ఇపుడు పువీ కి ఎంతో గర్వంగా ఉంది. తనకు సిక్స్‌పాక్ వచ్చింది. తనను తాను చెర్రీ, సల్మాన్ అనుకున్నాడు.
పువీ ఎంతో మారిపోయాడు.. ఇపుడు చూస్తే అమాంతం ప్రేమలో పడాల్సిందే అన్న సందేశం పువీని ముందు ఇష్టపడిన అమ్మాయికి ఎవరో చేరవేశారు. అవునా అనుకుంది. మళ్లీ సందేహించింది. ఒకరోజు అతనికి తెలియకుండా అతన్ని ఫాలో అయింది. పువీ బాడీ బిల్డింగ్ సెంటర్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటే తెరవెనకనుంచీ చూసింది. అవును నా వాడే అనుకుంది. అయ్యో వీడిని ఎందుకు వదులుకున్నాను.. ఎందుకు అవమానించాను.. అని తెగ బాధపడింది. కానీ పువీ మాత్రం బాధపడలేదు. ఇపుడు అతను 63 కిలోల బరువుతో ఉన్నాడు. చక్కని బాడీ.. అమ్మాయిలు ఎవరయినా పడతారు .. అదే ధైర్యంతో అద్దంలో చూసుకుని నవ్వుకున్నాడు.. తనను కాదన్న అమ్మాయి మాత్రం ఏడుస్తూ ఇంటిదారి పట్టింది!