రెండవ విడత సహకారం నేడే
posted on Feb 4, 2013 5:48AM
ఈ రోజు సోమవారం రాష్ట్రంలో రెండవ విడత సహకార ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 1484 వ్యవసాయ సహకార సంఘాలకు, 940 ఇతర సంఘాలకు ఈ రోజు ఎన్నికలు జరుగవలసి ఉండగా, వాటిలో 68సంఘాల ఎన్నికల పై ప్రభుత్వం స్టే విదించింది. మొదటి విడతలో రాజకీయ పార్టీలు ఒక దానికొకటి పూర్తిగా సహకరించుకోనట్లే, రెండవ విడతలో కూడా నీకిది-నాకది అనే రీతిలో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో 475 సంఘాలలో పోటీ లేకుండా ఏకగ్రీవం అయినందున అక్కడ ఎన్నికలు జరుపవలసిన అవసరం లేదు. ఈ రోజు ఉదయం 7గంటలకు మొదలయ్యే పోలింగు మధ్యాహ్నం 2గంటల జరుగుతుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు మొదలు పెట్టి పూర్తవగానే ఫలితాలు కూడా ఈ రోజే వెల్లడిస్తారు.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగే సంఘాలు:
జిల్లా పేరు |
సంఘాల సంఖ్య |
విశాఖపట్నం |
42 |
విజయనగరం |
37 |
శ్రీకాకుళం |
42 |
తూర్పుగోదావరి |
42 |
పశ్చిమగో దావరి |
56 |
కృష్టా |
95 |
గుంటూరు |
47 |
ప్రకా శం |
61 |
నెల్లూరు |
34 |
చిత్తూరు |
30 |
కడప |
22 |
కర్నూలు |
27 |
అనంతపురం |
42 |
అదిలాబాద్ |
35 |
కరీంనగర్ |
57 |
ఖమ్మం |
48 |
వరంగల్ |
33 |
నిజామబాద్ |
54 |
నల్లగొం డ |
53 |
మహబూ బ్‌నగర్ |
44 |
మెదక్ |
51 |
రంగారె డ్డి |
18 |