కర్ణాటకలో దూసుకెళ్తున్న కాంగ్రెస్
posted on May 2, 2023 @ 3:10PM
కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని తేలింది. రెండో స్థానంలో బీజేపీ, మూడోస్థానంలో జెడీ(ఎస్) ఉంది. అయితే జేడీఎస్ ముఖ్య భూమిక వహించనుంది. జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం.కన్నడ మీడియా సంస్థ ఎడీనా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు రానున్నాయి. కర్ణాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు రానుంది. మే 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 132 నుంచి 140 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకోనుందని ఎడీనా పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 224. అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలవనుంది. 57 నుంచి 65 స్థానాల్లో ఆ పార్టీ గెలవనుందని సర్వే తెలియజేసింది. జనతాదళ్ (ఎస్) కింగ్ మేకర్ గా అవతరించనుంది. కింగ్ మేకర్ అయినప్పటికీ ఆ పార్టీకి 19 నుంచి 25 స్థానాలు రానున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల వారిగా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ కర్ణాటక(31 నుంచి 37 స్థానాలు), ముంబయ్ కర్ణాటక (40 నుంచి 46), సదరన్ కర్ణాటక(26 నుంచి 32 ), బెంగుళూరు(16 నుంచి 20) స్థానాలు ఉన్నాయి. బిజేపీ హైదరాబాద్ కర్ణాటక(2 నుంచి 4)స్థానాలు, కోస్తా కర్ణాటక(10నుంచి 14 స్థానాలు), సెంట్రల్ కర్ణాటక ( 19 నుంచి 23 ) స్థానాలు కైవసం చేసుకోనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానుందని సర్వే రిపోర్టును అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ మరో 100 ఏళ్ల వరకు అధికారంలో రాదని జోస్యం చెప్పారు. అస్సాం ముఖ్యమంత్రి కర్ణాటకలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలోని తూమకూరు అసెంబ్లీనియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనడానికి ఆయన వచ్చారు. అవినీతి, అసమర్ధత నియోజకవర్గంలో రాజ్యమేలుతుందని బిశ్వాస్ చెప్పారు. ఇక్కడ 342 గ్రామాల్లో తాగునీరు, రోడ్ల సౌకర్యం లేదు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ స్వరూపం మారిపోతుందని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. ఎడీనా సంస్థ సర్వే ప్రకారం కర్ణాటకలో కాంగ్రేస్ మెజారిటీ స్థానాల్లో గెలుచుకుంటుందని, అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి ఖాయమని ఘంటాపథంగా చెబుతోంది. ఇదిలా వుండగా కర్ణాటకలో బీజేపీ, కాంగ్రేస్ పార్టీలు నువ్వానేనా అన్నట్లు తలపడతాయని ఏసియా న్యూస్ జన్ కీ బాత్ ఓపినియన్ పోల్ జోస్యం తెలియజేసింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 11 వరకు 30 వేల మంది ఓటర్లను సర్వే చేస్తే ఈ విషయం వెల్లడైంది. కోస్తా కర్ణాటకలో అధికార పార్టీ పట్టు బిగుస్తోంది. సెంట్రల్ కర్ణాటకలో బీజేపీ పరిస్థితి బాగా లేదు.