కాంగ్రెస్ ఇప్పుడు అన్నా, చెల్లి పార్టీ..జె.పి.నడ్డా
posted on Sep 30, 2022 @ 11:49AM
జాతీయస్థాయిలో కాంగ్రెస్తో పోటీ పడుతున్నప్పటికీ, వాస్తవానికి కాంగ్రెస్ జాతీయ, భారత్ స్థాయి నుంచి అన్నాచెల్లెలి పార్టీగా దిగజారిందని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా వ్యాఖ్యానించారు. గురువారం భువ నేశ్వర్లో బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ,జమ్ములో నేషనల్ కాన్ఫరెన్స్, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాది పార్టీ, బీహార్‌లో ఆర్జేడీ, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, ఒడిషాలో బీజెడీ, తెలంగాణాలో టీఆర్ ఎస్ వంటి కుటుంబ పాలితపార్టీలతో పోరాడుతోంద న్నారు. కనుక దేశంలో జాతీయపార్టీ స్థాయి కలిగి నది, ఆ విధంగా పిలవ బడుతున్న పార్టీ కేవలం తమ బీజేపీ యేనని అన్నారు.
బీజేపీ పార్టీ బలగం 18 కోట్లమంది అని, లోక్ సభలో 302 మంది ఎంపీలు, రాజ్యసభలో 92 మంది ఎంపీలు. 1,394 మంది ఎమ్మెల్యేలు, సుమారు 120 మంది మేయర్లు ఉన్నారన్నారు. దేశ వ్యాప్తంగా భారీ అభిమానుల సంఖ్యతో విస్తరించిందని, ఇంతటి శక్తివంతమైన పార్టీ ప్రపంచంలోనే లేదని నడ్డా అన్నారు. ఒడిసాలో నవీన్ పట్నాయక్ బీజేడీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి ఉందని, 2024లో తిరిగి అధి కారం లోకి నవీన్ రావడం దుర్లభమని అన్నారు.
రాష్ట్రంలో పీఎం ఆవాజ్ యోజన పథకానికి బిజూ పక్కా ఘర్ అని పేరు మార్చి ప్రజల్ని ఆకట్టుకుంటు న్నారని, ఇంతకంటే దారుణం మరోటి ఉండదని ఎద్దేవా చేశారు. అధికార బీజేపీపార్టీకి చెందిన ముగ్గురు మం త్రుల పై అవినీతి, హత్యారోపణ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. జగన్నాధ దేవాలయం గురించి ప్రస్తావి స్తూ , ఆ దేవాలయానికి సంబంధించిన నిధులు ఇక్కడ ఉండటం కూడా అంత సురక్షితం కాదని నడ్డా అన్నారు. అసలు రత్నభండార్ తాళాలు మారుతాళాలు న్నాయని కొందరు పేర్కొనడాన్ని ప్రస్తావించారు.