మామ రాజయ్యకు టికెట్ ఇవ్వద్దు.. సారిక లేఖ
posted on Nov 4, 2015 @ 11:03AM
కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య ఇంట్లో గ్యాస్ సిలీండర్ లీక్ అయి కోడలు సారిక, ముగ్గురు మనవలు మృతి చెందిన నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ఎలా లీకైంది అంటూ అనుమానం వ్యక్తమవుతుండగా కొత్తగా ఈ కేసులో మరో ట్విస్ట్ వచ్చి పడింది. అది సారిక రాసిన లెటర్. తన మామ అయిన రాజయ్యకు వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టికెట్ ఇవ్వద్దని అధిష్టానానికి లేఖ రాసిందట. అంతేకాదు తనను, తన పిల్లలని మామ రాజయ్య సరిగా చూసుకోవడం లేదని అందుకే వరంగల్ లోక్ సభ టికెట్ ఇవ్వొద్దంటూ లేఖలో పేర్కొందట. కానీ సారిక రాసిన ఆ లేఖ ఏమైందో ఏమో తెలియదు కాని కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజయ్యకు టికెట్ ఇస్తూ ప్రకటన చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన రెండు రోజుల తరువాత వరంగల్ లోని నివాసానికి వెళ్లిన రాజయ్య అక్కడ సారికతో గొడవపడినట్టు చెబుతున్నారు. దీంతో రాజయ్య బహుశ ఆ లేఖ గురించే గొడవ పడ్డారామే అని అనుమానిస్తున్నారు.
గతంలో కూడా సారిక తన భర్తపైన, మామ రాజయ్య, అత్తలపై పోలీసు కంప్లైట్ ఇచ్చిన దాఖలాలు కనపడుతున్నాయి. అంతేకాదు సారిక, రాజయ్యల మధ్య తరుచూ గొడవలు వస్తుండేవట. ఇప్పుడు ఈ ఘటన జరగడంతో ఇప్పుడు మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముందుముందు ఇంకెన్ని ట్విస్ట్ లు వస్తాయో చూడాలి.