టి.ఆర్.ఎస్.పై కాంగ్రెస్ విసుర్లు
posted on Apr 15, 2013 @ 2:05PM
కెసిఆర్ టి. కాంగ్రెస్ నేతలను మభ్యపెట్టి, తన మాయమాటలతో టి.ఆర్.ఎస్. లోకి ఆహ్వానిస్తున్నారని ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ కెసిఆర్ పై మండిపడుతున్నారు. టి. కాంగ్రెస్ నేతలకు టి.ఆర్.ఎస్.లోకి చేరడానికి డెడ్ లైన్ విధించడం ఏమిటని? తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం తానొక్కడే పాతుపడుతున్నాడని ఫోజులు పెట్టడం, తెలంగాణాపై మాట్లాడేందుకు తమకు మాత్రమే పేటెంట్ హక్కులు ఉన్నాయని కెసిఆర్ భావిస్తున్నారని, తెలంగాణా సీనియర్ నేత కె. కేశవరావు వంటివారు కెసిఆర్ మాయమాటలు ఎలా నమ్ముతున్నారని కెసిఆర్ పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ టి.కాంగ్రెస్ నేతలు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి నష్టం వాటిల్లదని, పెద్దపల్లి ఎంపి వివేక్ కాంగ్రెస్ ను వీడుతారనే వార్తలలో సత్యం లేదని తాను భావిస్తున్నట్లు, కెసిఆర్ టి.కాంగ్రెస్ మంత్రులను తన మాయాజాలంలో ఇరికించుకుంటున్నారని టి.కాంగ్రెస్ నేతలు కెసిఆర్ ను నమ్మవద్దని హితవు పలికారు.