Read more!

కాంగ్రెస్ లిస్టులో పాయింట్లివి..

 

 

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి ప్రకటించిన లిస్టులో ఆసక్తికరంగా వున్న అంశాలివి. మొత్తం 119 స్థానాలకు గాను 111 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో మొత్తం 49 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా 42 మందికి మళ్ళీ సీట్లు దక్కాయి. ఏడుగురికి సీట్లు దక్కలేదు. అందులో ఓవర్ యాక్షన్ చేసినందుకు శంకర్రావుకి, అనారోగ్య కారణాల వల్ల టి.మణెమ్మకి, కార్తీక్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చినందు వల్ల సబితా ఇంద్రారెడ్డికి టిక్కట్లు ఇవ్వలేదు. మిగతా సీట్లు పొత్తుల్లో పోయాయి.

 

కుటుంబానికి ఒకే టిక్కెట్ అనే పాలసీని కాంగ్రెస్ పాటించింది. రెడ్యానాయక్, రాంరెడ్డి సోదరులకు మాత్రం మినహాయింపు లభించింది. అనేకమంది నాయకుల వారసులకు మొండిచెయ్యి చూపించింది. నాయకులు ఎంత మొత్తుకున్న ఒక కుటుంబంలో మరో వ్యక్తికి టిక్కెట్ ఇవ్వలేదు. 8 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చారు. రెడ్డి కులస్తులకు ప్రాధాన్యం ఇచ్చారు.



లిస్టులో మొత్తం 47 మంది అగ్ర కులాలకు చెందినవారు వున్నారు. 32 మంది వెనుకబడిన కులాలకు చెందినవారున్నారు. 18 ఎస్సీ, 8 ఎస్టీ అభ్యర్థులున్నారు. టీ జేఏసీని ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా టిక్కెట్లు ఇవ్వలేదు. ఉద్యమంలో పాల్గొన్న గజ్జెల కాంతం, అద్దంకి దయాకర్, దరువు ఎల్లన్న టిక్కెట్లు వస్తాయని ప్రచారం చేసిన కాంగ్రెస్ చివరికి వాళ్ళకి మొండిచెయ్యి చూపించింది.