Read more!

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్యా యత్నం

 

 

 

మోడీ ప్రభంజనం ధాటికి ఓటమి తప్పదని అనుకున్నాడో, మరే కారణమో తెలియదుగానీ, వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండేటి శ్రీధర్ పరుగులు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. ఆయన ప్రస్తుతం వరంగల్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొండేటి శ్రీధర్ ఆత్మహత్యాయత్నం వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.