కుక్క కన్నా హీనం! కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్
posted on Feb 13, 2021 @ 7:10PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ లేకుంటే టీపీసీసీ ఉండేది కాదన్న వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. తెలంగాణ ఎట్లా వచ్చిందో కేటీఆర్ తెలుసుకుని మాట్లాడాలని జీవన్ రెడ్డి సూచించారు. ఉద్యమానికి స్ఫూర్తి ఎవరు? ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నదెవరో తెలంగాణ ప్రజలకు అంతా తెలుసన్నారు. తెలంగాణపై చర్చ జరిగిన రోజు లోక్ సభలో కేసీఆర్ లేడన్నారు జీవన్ రెడ్డి. ఆయన ఎక్కడ తాగి పన్నాడో ఆనాడాయనకే తెలియదని ఎద్దేవా చేశారు.
తెలంగాణకు కాపలా కుక్క లెక్క ఉంటా అన్న కేసీఆర్ కు.. ఇప్పుడు తెలంగాణా ప్రజలే కుక్కల్లా కనిపిస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు. కుక్కలకు విశ్వాసం ఉంటది.. కానీ విశ్వాసం లేని వ్యక్తి కేసీఆర్అం టూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి.సీఎం పదవిని ఎవడైనా చెప్పుతో సమానం అంటాడా..? చెప్పును పట్టుకుని మరింకా ఎందుకు వేలాడుతున్నావ్.. ఇడిసిపెట్టు కదా..? మళ్ళీ నేనే సీఎం అంటావ్? నీ టైం అయిపొయింది. నీ ఇంట్లో ముసులం పుట్టుంది.. మొగల్ సామ్రాజ్యం మాదిరిగా నీ ఇంట్లో ఔరాంగజేబు పుట్టిండు.. నీకు పదవి ఉండదు.. జాగ్రత్త అంటూ జీవన్ రెడ్డి హెచ్చరిక చేశారు.
నల్ల కుబేరులకు మోడీ అండగా నిలుస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. గుడిని పార్టీ అంశంగా మార్చుకుని ప్రజల్ని మత ప్రాతిపదికన చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు జీవన్ రెడ్డి. మద్దతు ధర కల్పించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ సన్న వడ్ల పేరుమీద ఏంచేశాడో తెలంగాణాలో అందరికీ తెలుసన్నారు. ధాన్యం సేకరణ నిలిచిపోతే బియ్యం పంపిణీ నిలిచిపోయే ప్రమాదముందన్నారు.