మళ్లీ కామన్ సివిల్ కోడ్
posted on May 1, 2023 @ 2:55PM
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది.ఈ ప్రణాళికలో వివాదాస్పద అంశం కామన్ సివిల్ కోడ్ చేరింది. తాము అధికారంలో వస్తే కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు జెపీ నడ్డా ప్రకటించారు. కర్ణాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది.
కర్ణాటకలో కామన్ సివిల్ కోడ్ అమలు చేసి తీరుతామని నడ్డా హామీ ఇచ్చారు. కామన్ సివిల్ కోడ్ అమలుకు భారత రాజ్యాంగం కూడా చెబుతుందని ఆయన చెబుతున్నారు. భారత దేశంలో కామన్ సివిల్ కోడ్ కేవలం గోవాలో మాత్రమే అమలవుతుంది. యూనిఫాం సివిల్ కోడ్ దేశానికి అత్యవసరమని మోడీ ప్రభుత్వం తొలినుంచి చెబుతూనే ఉంది. భారతీయ జనతా పార్టీ విధానాల్లో కామన్ సివిల్ కోడ్ అతిముఖ్యమైనది. యూనిఫాం సివిల్ కోడ్ అనేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 44లో స్పష్టంగా పొందుపరిచింది. భారత స్వాతంత్యం వచ్చాక వివిధ మతాలు కామన్ సివిల్ కోడ్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఇస్లాం మాత్రం ముస్లిం పర్సనల్ లా అమలు చేయాలని చెబుతోంది. భారత దేశంలో గత కొన్ని దశాబ్దాల నుంచి కామన్ సివిల్ కోడ్ వివాదాస్పదమౌతూనే ఉంది. వివాహాలు, విడాకుల విషయాల్లో కామన్ సివిల్ కోడ్ , ముస్లిం పర్సనల్ లా వేర్వేరుగా ఉన్నాయి. కామన్ సివిల్ కోడ్ అమలు చేయడానికి ఇది సరైన సమయం కాదని చాలామంది వాదిస్తున్నారు. కొత్త సమస్యలు లేవనెత్తుతాయన్నారు. భారత దేశం వంటి వైవిధ్యమైన దేశంలో కామన్ సివిల్ కోడ్ అమలు కావడం కష్టమేనని సామాజిక విశ్లేకులు అంటున్నారు.