మాయావతిని అంత మాట అన్నాడా..?
posted on Jul 20, 2016 @ 4:22PM
కొంత మంది నేతలు ఆవేశంతో అప్పుడప్పుడు తాము ఏం మాట్లాడుతున్నామో అన్న సంగతి కూడా మరిచిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతిపై కూడా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఒక వేశ్యతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాయవతి గురించి మాట్లాడుతూ.. 'డబ్బులు తీసుకున్న వేశ్య కూడా తాను ఒప్పుకున్న పనికి కట్టుబడి ఉంటుంది. మాయవతి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టిక్కెట్లు అమ్మేస్తున్నారు' అని దయాశంకర్ సింగ్ వ్యాఖ్యానించారు. కాన్షీరాం ఆశయాలను మాయావతి తుంగలోకి తొక్కారని విమర్శించారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన మాయావతి.. రోజు రోజుకి బీఎస్పీ పై పెరుగుతున్న ఆదరణ చూసి ఇలాంటి దిగుజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.. దయాశంకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.