స్కూల్ లో 38 మందికి కరోనా
posted on Mar 16, 2021 @ 8:41PM
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పాఠశాలల్లో మహమ్మారి కోరలు చాస్తోంది. హైదరాబాద్ శివారు నాగోల్‌లోని బండ్లగూడలో కరోనా కలకలం రేగింది. బాలికల మైనార్టీ పాఠశాలలో 38 మంది విద్యార్థినులకు కరోనా నిర్ధారణ అయింది. అదే పాఠశాలలో మొత్తం 160 మంది విద్యార్థినులు చదువుతున్నారు. విద్యార్థినులు, సిబ్బంది అందరికీ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసులు పెరిగితే అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. రోజు రోజుకూ గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
డెంటల్ ట్రీట్మెంట్ కోసం ఒక స్టూడెంట్ బయటకు వెళ్లారు.. అలా కరోనా వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. 27 మంది స్కూల్ స్టాఫ్ బయటకు.. వెళ్లి వస్తుంటారు అలా కూడా కరోనా ఎవరినుంచయినా వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. కరోనా టెస్టులో నెగటివ్ వచ్చిన కొందరు స్టూడెంట్స్ ను పేరెంట్స్ ఇంటికి తీసుకెళుతున్నారు. సడన్ గా ఫోన్ చేసి.. పిల్లలను తీసుకెళ్లమంటే ఎలా అని కొందరు పిల్లలు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కరోనా నెగటివ్ రిపోర్ట్స్ చూపించి లోపలకి పంపించినపుడు.. పాజిటివ్ ఎలా వచిందని నిలదీస్తున్నారు.
కొందరు పిల్లలకు ఫీవర్, బాడీ పెయిన్స్ ఉండడంతో... టెస్ట్ కు పంపారు ప్రిన్సిపాల్ వినీల. కొందరికి పాజిటివ్ రావడంతో... 152 మంది స్టూడెంట్స్, 27 మంది స్టాఫ్ కు టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. అంబులెన్స్ ను రెడీగా ఉంచడంతో పాటు... అవసరం అయితే టిమ్స్, గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తామని మేడ్చల్ హెల్త్ అధికారులు తెలిపారు. పిల్లలకు పాజిటివ్ రావడంతో కన్నీరు పేరెంట్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పిల్లలను చూడాల్సిందే అని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. దీంతో వీడియో కాల్స్ చేసి మాట్లాడిస్తున్నారు ప్రిన్సిపాల్ వినీల. పాజిటివ్ వచ్చిన చిన్నారులను కలిస్తే.. వైరస్ సోకె అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రులకు విస్తరిస్తున్నారు అధికారులు