నీరజ్ అంతిమయాత్ర..కోదండరాం వార్నింగ్

 

 

తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన నీరజ్ భరద్వాజ్ అంతిమయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంత్రి బసవరాజు సారయ్య ఫ్లెక్సీని విద్యార్థులు ధ్వంసం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికిదిగి రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ జరపవలసి వచ్చింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి గాయపడినట్లు సమాచారం.తోపులాటలో ఎమ్మెల్యే హరీష్ రావు గాయపడ్డారు.


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి నీరజ్ భరద్వాజ్‌ది ప్రభుత్వ హత్యేనని తెలంగాణ పొలిటికల్ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. భరద్వాజ్ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగానే విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.