కిరణ్ దిగ్విజయ్ కి మొహం చాటేస్తారా
posted on Jan 25, 2014 @ 9:06PM
రాజ్యసభ ఎన్నికలలో సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులు పార్టీ అభ్యర్ధికి వ్యతిరేఖంగా తమ అభ్యర్ధిని నిలబెత్టేందుకు సిద్దమవుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఈరోజు పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ డిల్లీ వెళ్లి పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో రాజ్యసభ అభ్యర్ధుల విషయంలో మంతనాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారిక అభ్యర్ధుల మాటెలా ఉన్నా, తిరుగుబాటు అభ్యర్దులలో కూడా మళ్ళీ తీవ్రమయిన పోటీ నెలకొంది. ఇంతవరకు జేసీ.దివాకర్ రెడ్డి, గంటా శ్రీనివాస రావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటే ఇప్పుడు వారికి ఉండవల్లి అరుణ్ కుమార్, యం.యల్సీ. చైతన్య రాజు కూడా తోడయ్యారు. వారిలో జేసీ దివాకర్ రెడ్డి తనకు 40మంది శాసనసభ్యుల మద్దతు ఉందని చెప్పుకొంటుండగా, చైతన్యరాజు తనకి 52మంది మద్దతు ఉన్నట్లు చెప్పుకొంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకవేళ రేపు పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ని కలిసేందుకు డిల్లీ వెళ్ళినట్లయితే ఈ పరిస్థితులు మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఈరోజు శాసనసభలో తెలంగాణా బిల్లుని చాలా ధాటిగా త్రిప్పికొట్టిన ఆయన రేపు డిల్లీకి వెళ్ళకుండా తమ తరపున వీరిలో ఎవరో ఒకరి పేరుని ఆయన ప్రతిపాదించవచ్చును.