కరుణానిధికి జయలలిత సవాల్...దమ్ముంటే మాట్లాడాలి..
posted on Aug 23, 2016 @ 11:12AM
తమిళనాడు రాజకీయాల్లో చాలా వేడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే అసెంబ్లీ నుండి డీఎంకే నేతలను సస్సెండ్ చేయడంతో ఆందోళనలు, ధర్నాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఓ సవాల్ విసిరారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన నేతలంతా అసెంబ్లీ నుండి సస్పెండ్ అయితే తాను ఒక్కతినే అసెంబ్లీకి వచ్చి సమావేశాల్లో పాల్గొన్నానని.. ఒక్కదానే మాట్లాడానని.. అలాంటిది.. ఇప్పుడు డీఎంకే పార్టీ నుండి కొంత మంది సస్పెండ్ వేటు నుండి తప్పించుకున్నారు.. అందులో కరుణానిధి కూడా ఉన్నారు.. అలాంటప్పుడు కీలక అంశాలు చర్చకు వచ్చినప్పుడు కరుణానిధి అసెంబ్లీకి రాకపోతే ఎలాగంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కరుణానిధికి సవాల్ విసిరారు.
కాగా అసెంబ్లీ సమావేశాల్లో డీఎంకే సభ్యులు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 79 మంది డిఎంకే ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయించారు జయలలిత.