ప్యాకేజీలపై చంద్రబాబు ప్రకటన..
posted on Sep 8, 2016 @ 4:28PM
ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలపై శాసన మండలిలో చంద్రబాబు ప్రకటన చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం రాలేదు.. ప్రభుత్వం వాదనను వినే పరిస్థితిలో కూడా ప్రతిపక్షం లేదు అని అన్నారు. జైట్లీ ప్రెస్ మీట్లో 4 అంశాలను వివరించారు.. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదు.. ప్రధాని హోదాలో మన్మోహన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలనికోరాం.. రాజధాని నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని కోరా.. హోదా వల్ల కలిగే ప్రయోజనాలను ఇస్తామని చెప్పారు.ఆదాయం సహా అన్నింటిలో వెనుకబడి ఉన్నాం పన్నుల రాయితీలపై కేంద్రం ముందుకు వచ్చి ఏపీకి ఆదుకోవాలి. పోలవరానికి 100శాతం నిధులు ఇస్తామని తెలిపారు.. 2018లోపు పోలవరం పూర్తి చేస్తాం.. పట్టిసీమను కూడా కొందరు అడ్డుపడ్డారు. పట్టిసీమను.. వట్టిసీమ అన్నారు. దేశంలో తొలిసారిగా రెండు నదులను కలిపాం.. నా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు అని అన్నారు.