రాహుల్ ను పొగిడిన అఖిలేష్.. పొత్తుకేనా..!
posted on Sep 8, 2016 @ 4:53PM
వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ ఎవరి వ్యూహాల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ బీజీ వాతావరణంలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు పొత్తుపెట్టుకుంటాయా అని.. ఎందుకంటే సీఎం అఖిలేష్ యాదవ్ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలు వింటే అలాగే అనిపిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాహుల్ తనకు మంచి మిత్రుడని, ఆయన మంచి మనిషని వెల్లడించిన అఖిలేష్, ఎంత ఎక్కువ సమయం రాహుల్ యూపీలో గడిపితే, తమ స్నేహం అంతగా పెరుగుతుందని అన్నారు. తాము కలుసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు 2017 ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్ వ్యాఖ్యలు కొత్త పొత్తులకు దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక ఇదే విషయాన్ని ఆయన్నే అడిగితే, తన వ్యాఖ్యలను మీడియా రాజకీయ కోణంలోనే చూస్తోందని అనేసి నవ్వుతూ వెళ్లిపోయారే తప్ప 'పొత్తుండదు' అని స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.