అప్పుడు వైఎస్.. ఇప్పుడు జగన్.. చంద్రబాబు
posted on Jun 22, 2016 @ 5:51PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎంత చిరాకు పెట్టిస్తున్నారో తెలిసిన విషయమే. ఈ విషయాన్ని ఆయన మాటల్లో ఇప్పటికే చాలాసార్లు అర్ధమైంది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు, జగన్ పై మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి ఆర్ధిక లోటులో ఉండగా రుణ విముక్తి చేయడం అనేది మామూలు విషయం కాదని.. అలాంటిది తాను లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ రైతులకు లక్షన్నర రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాలు రుణమాఫీపై అనవసర రాద్దాంతం చేస్తున్నాయని.. ఒకప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. ఎన్ని కష్టాలు పడ్డా మనకు అన్నాన్ని పెడతాడు.. అలాంటి రైతు సంక్షేమాన్ని మేము మరవబోం’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ రాష్ట్రాభివృద్దికి అందరూ కలిసి రావాలి.. నేను ఒక్కడినే కష్టపడితే రాష్ట అభివృద్ధి సాధ్యం కాదు.. అని వ్యాఖ్యానించారు.