హిజాబ్ తీర్పు సీజేఐ చేతిలో
posted on Oct 13, 2022 @ 12:15PM
కర్ణాటకాలో హిజాబ్ ధరంచడంపై సుప్రీం కోర్టులో గురువారం వెలువడిన తీర్పు రెండు రకాలుగా వచ్చిం ది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం నిషేధనపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలి యా విరుద్ధంగా తీర్పునిచ్చారు. విద్యార్ధులు హిజాబ్‌ను విద్యాసంస్థలకు వచ్చినపుడు ధరించ రాదని ఆయన తీర్పునిచ్చారు. ఇపుడు ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో పెట్టను న్నారు. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి విచారించి తీర్పు నివ్వవలసి ఉంటుంది.
ఈ అంశానికి సంబంధించి కర్ణాటక హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా వచ్చిన 26 అప్పీళ్లను జస్టిస్ హేమంత్ గుప్తా కొట్టివేశారు. విద్యాసంస్థల్లో పిల్లలు హిజాబ్‌ను ధరించడం అనేది ఇస్లాంలో ప్రత్యేకంగా చెప్పలేదని, అది అక్కడ ధరించి తీరాలన్నదేమీ ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై తాను 11 ప్రశ్నలతో ప్రశ్నావళిని తయారు చేయగా అందిన సమాధానాలన్నీ అప్పీళ్లకు వ్యతిరేకంగా వచ్చా యన్నారు.
అయితే రాష్ట్ర హైకోర్టు ఈ విషయంలో వేరే మార్గంలోకి వెళ్లిందని జస్టిస్ ధూలియా అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పును ఆయన త్రోసిపుచ్చారు. విద్యార్ధులు హిజాబ్‌ను ధరించడం అవసరమా కాదా అన్నది ఇస్లామ్‌లో పేర్కొన్నారా లేదా అన్న అంశం కూడా ఈ వివాదానికి అప్రస్తుతమన్నారు. ఈ అంశం వారి విద్యార్థుల అభిమతానికి, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19కి సంబంధించినదని ఆయన అన్నారు. విద్యార్ధిని జీవి తం మెరుగుపరుస్తున్నామా అన్నదే ఆలోచించానని, ఫిబ్రవరి 5న ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాన్ని రద్దు చేసి, ఆ నిషేధాన్ని తొలగించాలని ఆదేశించానని జస్టిస్ ధూలియా అన్నారు.
కాగా హిజాబ్ పై విరుద్ధ తీర్పులపట్ల కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ఇంతకంటే మంచి తీర్పు ఉండ దని, మహిళలంతా హిజాబ్‌ను ధరించడం ఇష్టపడడం లేదని మంత్రి బిసి నగేష్ అన్నారు. కోర్టు తీర్పు హర్షణీయమని అయితే, సుప్రీం కోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది అన్నారు.
కర్ణాటకాలో విద్యాలయాలకు ఆడపిల్లలు హిజాబ్ ధరించి తరగతులకు హాజరుకావడం మీద ఈఏడాడి ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. దాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన అప్పీళ్లపై హైకోర్టు కూడా నిషేధాజ్ఞలు సరయినవేనని తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ అంశంలో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వవలసి ఉంది. కాగా ప్రస్తుతం దేశంలో నిషేధించిన పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పి ఎఫ్ ఐ) ముస్లిం విద్యార్ధులు హిజాబ్ ధరించాల్సిందే అంటూ వివా దాన్ని లేవనెత్తిందని కర్ణాటక ప్రభుత్వ సుప్రీం కోర్టులో వాదన వినిపించింది.