టూరిజం కొత్త బ్రాండ్ అంబాసిడర్ చిరు
posted on Nov 2, 2012 @ 3:55PM
కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతల్ని స్వీకరించిన చిరంజీవి చకచకా పని మొదలుపెట్టారు. బాధ్యతలు తీసుకున్న తొలిరోజే కాకతీయ ఉత్సవాలమీద తొలిసంతకం పెట్టారు. పర్యాటక శాఖకి కొత్త బ్రాండ్ అంబాసిడర్ వచ్చారంటూ దగ్గరివాళ్లు చిరంజీవిపై ఆత్మీయంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చిరంజీవికి ఉన్న మెగా ఇమేజ్ కి టూరిజం శాఖ మంత్రి పదవి సరైనదని, చిరు ఇమేజ్ వల్ల టూరిజం శాఖకి లాభం కలుగుతుందని చాలామంది అనుకుంటున్నారు. ఉద్యోగుల్లోకూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఇంక్రెడిబుల్ ఇండియా కాన్సెప్ట్ విదేశాల్లో బాగా చొచ్చుకెళ్లేందుకు చిరంజీవి ప్రయత్నిస్తారని, విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు అవసరమైన గట్టి ప్రణాళికలు తయారు చేస్తారని చిరంజీవిపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయ్. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అత్మీయులంతా ఆశిస్తున్నారు. తనకి అప్పగించిన బాధ్యతల్ని సమర్ధంగా నిర్వహించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని చిరంజీవి చెబుతున్నారు.