మరాఠా రెండవ ఛత్రపతి రాజు.. శంభాజీ మహారాజ్ వర్థంతి..!


ఛత్రపతి శివాజీ.. ఈ పేరు చెబితే దేశ పౌరుల గుండెల్లో గర్వం,  దేశ భక్తి ఉప్పొంగుతాయి.  మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ దేశాన్ని ముస్లిం పాలకుల చేతిలో పడకుండా అడ్డుకోవడంలో శివాజీ మహారాజ్ పాత్ర చాలా ఉంది.  శివాజీ మహారాజ్ కు తల్లి జిజియాబాయి చాలా గొప్ప మాటలతోనూ,  దేశభక్తి,  దైవభక్తి,  వీరత్వం కలగలిపి పెంచింది.  అలాంటి జిజియా బాయి చేతిలో పెరిగినవాడు శంభాజీ మహారాజ్.. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్.  ఛత్రపతి శివాజీ గురించి ఈ దేశానికి తెలిసినంత శంభాజీ మహారాజ్ గురించి మొన్నటి దాకా తెలియదు. శంభాజీ మహారాజ్ చరిత్రను చరిత్రకారులు కాలగర్భంలో కలిపేశారు.  ఇంకా చెప్పాలంటే.. శంభాజీ మహారాజ్ త్యాగానికి గుర్తింపు కూడా లేకుండా మరుగున ఉంచారు. కానీ చావా సినిమాతో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి దేశానికి తెలిసింది.  అప్పటి నుండి శంభాజీ  మహారాజ్ పట్ల గౌరవం,  ఆయన పట్ల భక్తిభావం పెరుగుతున్నాయి.   మార్చి 11వ తేదీన ఆయన మరణించారు.  ఆయన వర్థంతి సందర్బంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే..

మరాఠా యోధులు వీరత్వానికి పెట్టింది పేరు. ఈ మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు,  ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు సంభాజీరాజ్ భోస్లే. ఈయనను అందరూ శంభాజీ అనే పిలుస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడం,  మొఘల్ సైన్యాలను ఎదుర్కోవడం ద్వారా దక్షిణ భారతదేశం మొఘలుల చేతిలో పడకుండా చేయడంలో శంభాజీ మహారాజ్ కీలకపాత్ర పోషించాడు. కేవలం 33 సంవత్సరాలు జీవించిన శంభాజీ మహారాజ్ వీరత్వం ఎన్ని శతాబ్దాలు గడిచినా చెప్పుకోదగినది.

1657 సంవత్సలం మే 14న పురందర్ కోటలో శంభాజీ మహారాజ్ జన్మించాడు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ తల్లి సాయిబాయి శంభాజీ చిన్నతనంలోనే మరణించింది. దీంతో రాజమాత జిజాబాయి  శంభాజీ సంరక్షణ చూసుకుంది.  ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఎలా పెంచిందో అదే విధంగా శంభాజీని కూడా పెంచింది ఆవిడ.  ఒక దశలో శంభాజీ మహారాజ్ కు ప్రాణాపాయం పొంచి ఉందని గ్రహించి శంభాజీ చనిపోయాడని శివాజీ మహారాజ్ పుకారు వ్యాప్తి చేశాడు.

శంభాజీ గొప్ప వీరుడు,  మంచి శరీర సౌష్టవం కలవాడు,  అన్నింటి కంటే ఎక్కువగా భాష ప్రావీణ్యం కలవాడు. ఆయన మరాఠా,  హిందీ, ఇంగ్లీషు, మలయాళం తో సహా చాలా భాషలు అనర్గళంగా మాట్లాడేవాడట. ఇక   శంభాజీ మహారాజ్ వీరత్వం, ధైర్యం, తెగువను చావా సినిమాలో చూపించారు.  అయితే ఇది ఆయన వీరత్వం, ధైర్యం, తెగువ ముందు ఇంకా తక్కువే.. ఆయన శత్రువుకు భయపడేవాడు కాదు.  చివరకు మోసపూరితంగా ఔరంగజేబు శంభాజీని బంధించి చిత్రవధకు గురి చేసినా సరే.. హిందూ మతం పట్ల కించిత్తు కూడా అభిప్రాయం మార్చుకోలేదు.  శంభాజీని చిత్ర హింసలకు గురి చేస్తున్న సన్నివేశాలు సినిమాలో చూస్తుంటేనే కళ్లలో నీళ్లు వస్తాయి.  అలాంటిది ఆయనను వాస్తవంగా ఎంత నరకానికి గురి చేసి ఉంటారో తలచుకుంటే ప్రతి దేశ పౌరుడి గుండె బరువెక్కుతుంది. తను అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాలలో జాజారు 120 యుద్దాలు  చేసి ఒక్క యుద్దం కూడా ఓడిపోని వీరుడు శంభాజీ.  అలాంటి శంభాజీ మహారాజ్  త్యాగాన్ని, ఆయన చరిత్రను,  ఆయన పోరాటపటిమను అందరూ తెలుసుకోవాలి.  


                                       *రూపశ్రీ.

Teluguone gnews banner