చెన్నైలో నిరసల సెగ..
posted on Jan 27, 2016 @ 5:31PM
చెన్నైలో నిరసల సెగ మరితం ఉద్రిక్తమయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపైనే ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతుంటే.. తాజాగా తమిళనాడులో ముగ్గురు మహిళా వైద్య విద్యార్ధినులు ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు విద్యార్ధుల ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి. ఈ రెండు ఘటనలతో చెన్నై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలకు దిగారు. రెండు ఉదంతాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ.. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరాని తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దాదాపు 60 మంది విద్యార్దులను అదుపులోకి తీసుకున్నారు. కాగా హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ దేశవ్యాప్తంగా వర్సిటీల బంద్‌కు హెచ్‌సీయూ జేఏసీ పిలుపునిచ్చింది. నేడు, రేపు రెండురోజులపాటు కూడా ర్యాలీలు, ఆందోళనలు చేసేందుకు విద్యార్ధులు సిద్ధమవుతున్నారు.