15 పాఠశాలలకు బాంబు బెదిరింపు..
posted on Feb 8, 2016 @ 4:39PM
ఇటీవలే అస్ట్లేలియాలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చి అందరిని భయానికి గురిచేశారు దుండగలు. ఇప్పుడు అలాంటి పరిణామమే తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని కడలూరులో పాఠశాలలకు బాంబు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఫోన్లు రావడంతో భయపడి పాఠశాలలను మూసివేశారు. అధికారులు వెంటనే స్పందించి బాంబు స్క్వాడ్ సిబ్బందిని తెప్పించి పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో పాఠశాలల్లో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. కాగా తల్లిదండ్రులు ఎవరూ భయభ్రాంతులకు గురి కావద్దని పిల్లలందరూ క్షేమంగానే ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. విద్యార్థులందరిని వారి వారి ఇళ్లకు పంపించివేశారు.