అసదుద్దీన్ ఒవైసీ అరెస్టు… విడుదల!
posted on Feb 8, 2016 @ 4:08PM
గ్రేటర్ ఎన్నికలలో జరిగిన ఒక దాడి కేసులో మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ నేడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనకు ఆరోగ్య తనిఖీలను నిర్వహించిన పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం వేళకి అసదుద్దీన్‌ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఆయనను ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు మీద విడుదల చేశారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలోని పురానాపూల్ వద్ద అసదుద్దీన్ తన అనుచరులతో కలిసి కాంగ్రెన్ నేతల మీద దాడి చేశారన్నది ప్రధాన అభియోగం. ఈ దాడిలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి వాహనం ధ్వంసం కాగా, షబ్బీర్ అలీకు స్వల్ప గాయాలు అయ్యాయి. కాంగ్రెస్ నేతల అభియోగం మేరకు పురానాపూల్‌లో మళ్లీ రీపోలింగ్ సైతం జరిగింది. దాడికి అసదుద్దీన్ నేతృత్వం వహించారనీ, భౌతిక దాడికి పాల్పడ్డారనీ… ఆయన మీద కేసు నమోదైంది.