పేర్ని నాని చేతిలో చెప్పుల జత
posted on Jun 16, 2023 7:23AM
ఓ వైపు ఎన్నికలు సునామీలా దూసుకొచ్చేస్తున్నాయి... మరోవైపు సైకిల్ పార్టీతో జనసేన పార్టీ కలిసి అడుగులు వేస్తోంది.. దీంతో అధికార ఫ్యాన్ పార్టీ అగ్రనేతల్లో ఫ్రస్ట్రేరేషన్ పీక్స్ చేరిందా? ఆ క్రమంలోనే మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని.. జూన్ 15వ తేదీ ప్రెస్‌మీట్ పెట్టి.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తన మాటల తూటాలతో చెలరేగిపోయాడనే ఓ చర్చ అయితే పోలిటిలక్ సర్కిల్‌లో వాడి వేడిగా ఊపందుకొంది. వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాలనే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్.. వ్యూహాత్మకంగా అడుగులు వేసుకొంటూ వెళ్తున్నారని.. అలాగే అదే టార్గెట్‌గా పెట్టుకొని పని చేయాలంటూ.. పార్టీ శ్రేణులకు ఆయన ఓ దిశానిర్దేశాన్ని కూడా చేశారని సదరు సర్కిల్‌లో వైరల్ అవుతోంది.
అయితే పసుపు పార్టీతో జననసే పార్టీ అడుగులో అడుగు వేసుకొంటూ.. ఎన్నికలకు వెళ్లితే.. తమ బతుకు బందరు బస్టాండేనని ఫ్యాన్ పార్టీ నేతలకు క్లియర్ కట్‌గా అర్థమైందని.. ఆ క్రమంలోనే బందరు ఎమ్మెల్యే పేర్ని నాని అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి.. చెప్పులు చూపించాడనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వాయివేగంతో వైరల్ అవుతోంది. అంతేకాదు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల క్లిప్లింగులను సైతం ఈ ప్రెస్ మీట్‌లో పేర్ని నాని ప్రదర్శించడం ద్వారా ఫ్యాన్ పార్టీ నేతలు తమ కక్ష తీర్చుకొన్నారనే అబిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.
అయితే అర్థం కానీ విషయం ఏమిటంటే.. దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.. జనసేనాని పవన్ కల్యాణ్.. నాడు ఎప్పుడో వైసీపీ నేతలకు చెప్పు చూపిస్తే.. దానికి ప్రతిగా నేడు పేర్ని నాని రెండు చెప్పులు చూపించారని.. దీనిని బట్టే ఫ్యాన్ పార్టీ నేతల్లో ఓ విధమైన భయం, ఆందోళన గూడు కట్టుకోన్నాయనే విషయం అర్థమవుతోందని చర్చ సైతం కొన.. సాగుతోంది.
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే.. జనసేన పార్టీ బయట నుంచి మద్దతు ప్రకటించిందని.. సదరు ఎన్నికల్లో ఈ కూటమి తన.. సత్తా చాటడంతో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిందని... అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా బరిలోకి దిగడంతో ఓట్లు భారీగా చీలిపోయి.. జగన్ పార్టీకి గెలుపునకు కలిసి వచ్చిందని.. దీంతో జగన్ గద్దెనెక్కారని గుర్తు చేసుకొంటున్నారు. అయితే 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే.. 2014 నాటి ఎన్నికల ఫలితాల కంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రజల్లో ఓ స్పష్టతతో కూడిన అభిప్రాయం వ్యక్తమవుతోందని... అలాంటి వేళ పేర్ని నాని ప్రెస్‌మీట్ పెట్టి.. ఈ తరహా వ్యాఖ్యలు చేశారనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.
మరోవైపు జగన్ ప్రభుత్వం ఈ నాలుగేళ్ల పాలనలోని లోపాలను ఇప్పటికే ప్రజలు స్పష్టంగా గుర్తించారని.. అలాగే జగన్ తొలి మలి కేబినెట్‌లోని మంత్రులు న భూతే న భవిష్యత్త్ అన్నట్లుగా వారు మాట్లాడుతోన్న బూతు పురాణం, అదే విధంగా మూడు రాజధానులు అంటూ ప్రకటించి.. మూడేళ్లు గడిచినా.. ఎక్కడ అభివృద్ధి మాత్రం వీసమెత్తు కూడా జరగకపోవడం.. ఇక రాష్ట్రాభివృద్ధిపైనే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపైన సైతం ఈ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కనీస అవగాహన లేదని స్పష్టం కావడం.. ఇంకోవైపు విభజన సమస్యలతో రాష్ట్రం సతమతమవుతోందని.. విభజన సమస్యల పరిష్కారించే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడం తదితర అంశాలపై ప్రజలు పక్కా క్లారిటీతో ఉన్నారనే విషయం వీరికి అర్థమైందని.. అలాగే గత ఎన్నికల వేళ వైయస్ జగన్ వెంట మద్దతుగా ఆయన తల్లి వైయస్ విజయమ్మ, చెల్లి వైయస్ షర్మిల ఉన్నారని కానీ నేడు ఆ పరిస్థితి అయితే లేదని.. ఇక సీఎం వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్య కేసులో అందరి చూపులే కాదు..వేళ్లని కడప ఎంపీ, సోదరుడు వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయని.. ఆ క్రమంలో ముఖ్యమంత్రిగానే కాక. వైయస్ ఫ్యామిలీలోని మనిషిగా వైయస్ జగన్ వ్యవహర శైలిని సైతం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని.. అలాగే ఈ హత్య కేసులో న్యాయ పోరాటం కోసం వైయస్ జగన్ సోదరి వైయస్ సునీత తీవ్రంగా శ్రమిస్తున్నారు.
దీంతో ఈ టోటల్ ఎపిసోడ్‌లో వైయస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేకత ఉందని ఫ్యాన్ పార్టీలోని అగ్ర నాయకత్వం ముందే ఊహించిందని.. దాంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిస్తే.. వచ్చే ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ పార్టీ మొత్తానికి మోత మోగిపోవడం ఖాయమనే ఓ క్లియర్ కట్ ఇండికేషన్ ఇప్పటికే ఫ్యాన్ పార్టీ లక్కీ ప్యాక్.. ఐ ప్యాక్ నివేదిక ఇచ్చి ఉంటుందని ... ఈ నేపథ్యంలో పేర్ని నాని ప్రస్ట్రేషన్‌లో ప్రెస్ మీట్ పెట్టి చేలరేగిపోయి ఉంటారనే చర్చ పోలిటికల్ సర్కిల్‌లో యమరంజుగా కొన...సాగుతోంది.